మహిళలకే కాదు వారికి ఉచిత బస్సులు.. సూపర్ న్యూస్ చెప్పిన తెలంగాణా ఆర్టీసీ!
తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించింది. దావోస్ మోడల్ లో నిర్వహించిన ఈ సదస్సులో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047 ను విడుదల చేశారు.
ఉచిత బస్సులపై కీలక ప్రకటన
ఈ గ్లోబల్ సమ్మిట్ లో 44దేశాల నుండి 154మంది ప్రతినిధులు హాజరు కాగా, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నారు. అయితే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ స్టాల్స్ ను సందర్శించడానికి తెలంగాణ ఆర్టీసీ ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది. ఈ పబ్లిక్ ఎగ్జిబిషన్ సందర్భంగా తెలంగాణా ఆర్టీసీ ఒక ప్రకటన ఇచ్చింది.

గ్రేటర్ హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీకి ఉచిత బస్సులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణా ఆర్టీసీ ఈ ఉచిత బస్సులను నడుపుతున్నట్టు పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు ఈ ఉచిత బస్సులు నడుస్తున్నాయి. ఉప్పల్, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, శంషాబాద్, మియాపూర్, ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి ప్రధాన ప్రాంతాల నుండి ఈ బస్సులు బయలుదేరతాయి. ప్రతీరోజూ ఉదయం 9 గంటల నుండి 12గంటలవరకు ప్రతీ గంటకు బస్సులు వెళ్తాయి.
భారత్ ఫ్యూచర్ సిటీకి బస్సులు అప్పటివరకే .
మళ్లీ ఫ్యూచర్ సిటీ నుండి తిరిగి ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి 7 గంటల వరకు బస్సులు ప్రారంభమవుతాయి. సాయంత్రం కూడా ప్రతిగంటకు బస్సులు ఉన్నాయి. రెండు రోజుల పాటు ఈ ఉచిత బస్సుల సదుపాయాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కోరుతోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటుచేసిన పబ్లిక్ ఎగ్జిబిషన్ లో ఎగ్జిబిట్ లను తిలకించాలని ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది.
తెలంగాణా విజన్ డాక్యుమెంట్ పై అవగాహన వచ్చేలా స్టాల్స్
తెలంగాణ అభివృద్ధికి రూపొందించిన విజన్ 2047 ప్రణాళికను వివిధ మోడల్ లు, డిజిటల్ డిస్ప్లేలు, ప్రజెంటేషన్ ల రూపంలో ఏర్పాటు చేసినందున వాటన్నింటిని తిలకించాలని, తెలంగాణ ప్రభుత్వ రోడ్డు మ్యాప్ ను అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ఇందుకోసమే భారత్ ఫ్యూచర్ సిటీలోని పబ్లిక్ ఎగ్జిబిషన్స్ స్థలానికి ఉచిత బస్సులను నడుపుతుంది.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
బిగ్ షాక్.. తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ -
తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications