మంత్రి కేటీఆర్ ప్రతిపాదన భేష్!: ట్విట్టర్‌లో మద్దతు తెలిపిన హీరో

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత హరితహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంటి అనుమతికి మొక్కలు నాటడం తప్పనిసరి చేయాలన్న మంత్రి కేటీఆర్ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంలందుకొంటోంది.

రెండో విడత హరితహారం సందర్భంగా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో ఖాతాలో ఇంటి నిర్మాణానికి అనుమతులు పొందాలంటే తప్పనిసరిగా కొన్ని మొక్కలు నాటాలనే నిబంధన తేవాలని అనుకుంటున్నాం. నీటిని పొదుపుచేయడంతో పాటు ఈ నిబంధన కూడా పెట్టాలని ఆలోచన చేస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌కు భారీ స్పందన వచ్చింది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ రామ్ అన్నా.. మీ నిర్ణయం అద్భుతమైనదే కాకుండా అభివృద్ధికి దారులు వేసేది కూడా. మీకు మరింత శక్తి లభించాలని కోరుకుంటున్నాను. ఈ నిర్ణయం తప్పనిసరి చేయడం ద్వారా కాంక్రీట్ అడవిగా మారిపోయిన మన నగరం ఆకుపచ్చగా మారుతుంది అని సంతోషం వ్యక్తం చేస్తూ రీట్వీట్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bollywood Hero Vivek oberoi response on ktr in twitter regarding plantation in Telangana.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి