డాక్టర్ కావాలనుకొని.. వివాహిత మృతి: టెక్కీ భర్తపై అనుమానాలు
ఎల్బీ నగర్‌లో దారుణం జరిగింది. హారిక అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో ఆదివారం సాయంత్రం మృతి చెందింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
హైదరాబాద్: ఎల్బీ నగర్‌లో దారుణం జరిగింది. హారిక అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో ఆదివారం సాయంత్రం మృతి చెందింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఈ సంఘటన ఎల్బీ నగర్ రాక్ టోన్ కాలనీలో జరిగింది. హారికను భర్త రిషి కుమార్ కొట్టి, కాల్చి చంపేశాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. కానీ ఆమె ఎలా చనిపోయిందో తనకు తెలియదని రిషి కుమార్ చెబుతున్నారు.

భార్యాభర్తల మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు ఉన్నాయి. రిషి కుమార్ తండ్రి మాజీ పోలీస్ అధికారి అని తెలుస్తోంది. రిషి సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రిషి కుమార్, హారికలు బంధువులే. ఇద్దరికి కొద్ది కాలం క్రితం పెళ్లయింది.
డాక్టర్ చదవాలనేది హారిక కోరిక. ఇంటర్ పూర్తి కాగానే పెళ్లయింది. తాను డాక్టర్ కోర్స్ చదవిస్తానని రిషి కుమార్ చెప్పడంతో హారిక పెళ్లి చేసుకుంది. గత ఏడాది కోచింగ్ తీసుకుంటోంది. గత ఏడాది సీటు రాలేదు. కానీ ఇంతలోనే చనిపోయింది. కాగా, ఎంబిబిఎస్‌లో సీటు రానందుకు హత్య చేశాడని అంటున్నారు. కాగా, పోలీసులు రిషి కుమార్, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications