Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంగారం ధరల పెరుగుదల వెనుక స్విట్జర్లాండ్‌ భారీ స్కెచ్.. టన్నుల కొద్ది పసిడి బంకర్లలో నిల్వ..

బంగారం ధరలు రాకెట్ కన్నా వేగంతో దూసుకుపోతున్నాయి. ధరలు కనివినీ ఎరుగని రీతిలో పెరిగాయి. అమెరికా డాలర్ క్రమంగా బలహీనపడటం, సావరిన్ బాండ్లపై నమ్మకం తగ్గడం, అలాగే ప్రధాన కరెన్సీల నుంచి పెట్టుబడిదారులు బయటకు రావడం వంటి కారణాలతో బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 5,500 డాలర్ల స్థాయిని దాటుతూ కొత్త రికార్డును నెలకొల్పింది.

దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరిగింది.. ఈ నేపథ్యంలోనే క్రిప్టో ప్రపంచంలో అతి పెద్ద స్టేబుల్‌కాయిన్ జారీదారైన టెథర్ హోల్డింగ్స్ ఒక సంచలనాత్మక వ్యూహంతో ముందుకు వచ్చింది. బిట్‌కాయిన్ వంటి డిజిటల్ ఆస్తులకన్నా.. బంగారమే భవిష్యత్తుకు సురక్షితమైన ఆస్తి అన్న నమ్మకంతో టెథర్ భారీ స్థాయిలో బంగారాన్ని నిల్వ చేస్తోంది. ఈ నిర్ణయంతో టెథర్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ బంగారం హోల్డర్లలో ఒకటిగా మారింది.


Gold price 5 500 gold all-time high gold cracks 5 500 gold price today gold safe haven crypto firm gold storage nuclear bunker gold 140 tons gold storage gold vs bitcoin crypto backed by gold global economic uncertainty inflation hedge assets central bank gold buying bullion storage bunker precious metals rally digital assets and gold geopolitical tensions gold gold market news investment safe assets record gold prices 5 500 140 amp amp
Photo Credit:

టెథర్ CEO పాలో అర్డోయినో ఇటీవల బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డాలర్ విలువ క్రమంగా తగ్గిపోతున్న ఈ కాలంలో Gold ఒక రుణ రహిత, సురక్షిత రిజర్వ్ ఆస్తి అని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు కూడా బంగారం వైపు మొగ్గు చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం టెథర్.. స్విట్జర్లాండ్‌లోని ఒక మాజీ హై-సెక్యూరిటీ న్యూక్లియర్ బంకర్‌లో దాదాపు 140 టన్నుల బంగారాన్ని నిల్వ చేసింది. దీని విలువ సుమారు 24 బిలియన్ డాలర్లు. గత ఒక్క ఏడాది చూస్తే.. టెథర్ 70 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేసింది. అంతేకాదు, ప్రస్తుతం కూడా వారానికి ఒకటి నుంచి రెండు టన్నుల వరకు బంగారాన్ని కొనుగోలు చేస్తూ, ప్రధాన కేంద్ర బ్యాంకులు, గోల్డ్ ETFలతో పోటీ పడుతోంది.

ఈ బంగారం కొనుగోళ్లకు కావలసిన నిధులు టెథర్ జారీ చేసే USDT (స్టేబుల్‌కాయిన్) లాభాల నుంచే వస్తున్నాయి. ఈ బంగారం నిల్వలు రెండు విధాలుగా ఉపయోగపడుతున్నాయి. వాటిలో ఒకటి కంపెనీ ఆర్థిక భద్రత కోసం రిజర్వ్ ఆస్తిగా.. రెండోది టెథర్ విడుదల చేసిన బంగారం ఆధారిత డిజిటల్ టోకెన్ XAUT కు మద్దతుగా నిలుస్తున్నాయి.

బంగారం ధరల పెరుగుదలపై గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజాలు షాకింగ్ నివేదిక.. పసిడి ర్యాలీ ఎంత వరకు సాగుతుందంటే..

అయితే ఇంతటితో టెథర్ ఆగడం లేదు. కేవలం బంగారాన్ని నిల్వ చేయడమే కాకుండా, దాన్ని చురుకుగా వ్యాపారం (ట్రేడింగ్) చేయాలని కూడా సంస్థ భావిస్తోంది. ఈ లక్ష్యంతో HSBC వంటి పెద్ద బ్యాంకుల నుంచి సీనియర్ బులియన్ ట్రేడర్లను నియమించుకుంది. దీర్ఘకాలికంగా భౌతిక బంగారాన్ని ఉంచుకుంటూనే.. మార్కెట్లోని అసమర్థతలను ఉపయోగించుకుని పెద్ద బులియన్ బ్యాంకులకు పోటీ ఇవ్వాలన్నదే టెథర్ వ్యూహం. అంతేకాదు, బంగారు రాయల్టీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు కూడా పెట్టుతోంది.

విశ్లేషకుల ప్రకారం.. 2025లో బంగారం ధర దాదాపు 65 శాతం పెరగడానికి టెథర్ ఒక్కటే కారణం కాకపోయినా.. ఈ భారీ కొనుగోళ్లు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. అయితే, డాలర్ కాని ఆస్తులపై ఎక్కువ ఆధారపడటం కొంత ప్రమాదాన్ని కూడా కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే కారణంతో S&P సంస్థ USDT స్థిరత్వ రేటింగ్‌ను బలహీనంగా తగ్గించింది.

అయినా టెథర్ తీసుకున్న నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. భవిష్యత్తులో టోకనైజ్డ్ గోల్డ్ వేగంగా విస్తరిస్తుందని టెథర్ అంచనా వేస్తోంది. XAUT టోకెన్ల మార్కెట్ విలువ 5 నుంచి 10 బిలియన్ డాలర్లకు చేరవచ్చని, దీర్ఘకాలంలో ఇది US డాలర్‌కు Gold ఆధారిత ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని కంపెనీ విశ్వసిస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Credit: Goodreturns

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+