వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టొరంటోలో ఘనంగా దీపావళి

By Santaram
|
Google Oneindia TeluguNews

Deepavali Crackers
తెలుగు కల్చరల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ టొరంటో ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక డాన్‌ బోస్కో పాఠశాలలో నిర్వహించిన ఈ దీపావళి వేడుకలలో 600 మందికి పైగా తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. టొరంటోతో పాటు బ్రాంప్టన్‌, మిస్సిసౌగ, స్కార్‌బోరో, కిచెనెర్‌, వాటర్లూ, కేమ్‌బ్రిడ్జ్‌, హామిల్టన్‌, మిల్టన్‌ తదితర ప్రాంతాల నుంచి కూడా తెలుగు కుటుంబాలు తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. 'తానా' రీజనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మధుసూదన్‌ చిగురుపాటి దీపప్రజ్వలనం, కెనడా జాతీయ గీతాలపనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షులు సూర్య బెజవాడ స్వాగతోపన్యాసం చేసారు. సాయి శరణ్య టీమ్‌ గణపతి గీతాన్ని ఆలపించింది.

రవికుమార్‌ గూడపాటి, అనిత కృష్ణ నేతృత్వంలో నిర్వహించిన మ్యూజికల్‌ నైట్‌ వేడుకల్లో హైలైట్‌గా నిలిచింది. లత కుందుర్పి, కుందన దవులూరు, వినిత కల్లమ్‌, సన్నిధి సబ్లిండ్ల, మాధవ్‌ బెజవాడ, శ్రెయ సల్బిండ్ల, లోకేష్‌ మువ్వ, జాషువా మకల, శివ దువులూరు, లీష పిల్ల, శరణ్య లింగాల, పరిణీత లింగాల, రాజేంద్ర ప్రసాద్‌, మధు, కృష్ణచైతన్య బద్రిరాజు, నిషాంత్‌ చేకూరి, విశాల్‌ బెజవాడ, అనుపమ చెవురు, విదాత్రి పెద్ది, భాను ఉప్పలపాటి, నిషాంత్‌ చేకూరి, ప్రియాంక మువ్వ, విజయ్‌ రాయవరపు, కావ్య, ఆదిత్య రాయవరపు, శ్రీత, మృదుల చేకూరి, శారద కాలె, అనిత బెజవాడ, స్మిత కలకోట, ప్రసన్న మేకల, యోగిత లింగాల, నీలిమ కక్కిరాల, ఉష మువ్వ, మాధవి తుమ్మ, శ్రీదేవి పిల్ల తదితరులు విభిన్న ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. ఈ సందర్భంగా రావ్‌ పోలవరపు, మహాలక్ష్మి తిమ్మన, సంపత్‌ వూరలకు విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేసారు.

చివరగా కార్యక్రమ నిర్వహణకు విశేష కృషి చేసిన సభ్యులు వెంకట్‌ కొల్లి, నవీన్‌ వడ్లమూడి, బోస్‌ వేమూరి, ప్రసాద్‌ నారాయణల, శ్రీ మహాలక్ష్మి అంబటి, కావ్య కంతమనేని, రుహి జవహర్‌, రావ్‌ వజ, విజయ రావ్‌ బొబ్బిలి, ప్రభు కుందుర్పి, లక్ష్మినారాయణ దవులూరి, రాజశేఖర్‌ వెలువోలు, కుటుంబరావు బొప్పన్న, రఘు కంతమనేని, మోహన్‌ అమృతలూరు, రియాజ్‌ అలి, అస్రర్‌ అలి, రమ అముజూరి, అనుపమ చెరువు, శ్రీధర్‌ నాగవరపు తదితరులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో దీపావళి వేడుకలు ముగిసాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X