వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఘనంగా నెలనెలా తెలుగు వెన్నెల

By Santaram
|
Google Oneindia TeluguNews

Telugu Vennela programme in America
డల్లాస్‌: అమెరికా ఉత్తర టెక్సాస్‌ తెలుగుసంఘం ఆధ్వర్యంలో నిర్వహించే 'నెల నెలా తెలుగు వెన్నెల' కార్యక్రమం ఫనేషియా రిచర్డ్‌సన్‌లో ఘనంగా జరిగింది. డల్లాస్‌లోని ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమానికి డాక్టర్‌ నరసింహారెడ్డి వూరమిండి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తెలుగు సినీ గేయ రచయిత స్వర్గీయ వేటూరి సుందరామ్మూర్తికి ఘనంగా నివాళులర్పించారు. విజయ్‌ చంద్రహాస్‌ మాట్లాడుతూ..వేటూరి రచన శైలిని, ఆయన విశిష్టతలను సభికులకు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామవేదం షణ్ముకశర్మ విచ్చేశారు.

పద కవితా పితామహుడు అన్నమయ్య పద కవిత్వం సామెతలు, శృంగార కీర్తనలు, దశావతారాలు,క్షేత్రయ్య శృంగార సాహిత్యం మొదలైన వాటిని షణ్ముకశర్మ కూలంకషంగా సభికులకు విశదీకరించారు. మరో ముఖ్య అతిథి డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ.. తెలుగు భాష సంస్కృతి, పత్రికలు, టెలివిజన్‌ భాషపై వాటి ప్రభావాలను ఉదాహరణలతో వివరించారు. భాష పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష అంతరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టాంటెక్స్‌ తెలుగు సంఘం అధ్యక్షుడు చంద్ర కన్నెగంటి, పాలకమండలి సభ్యుడు శ్రీనివాస్‌ రెడ్డి ఆళ్లలు వేదాంతం షణ్ముక శర్మని, టాంటెక్స్‌ ఉపాధ్యక్షుడు ఎన్‌.ఎమ్‌.ఎస్‌.రెడ్డి, పూర్వాధ్యక్షుడు ప్రసాద్‌ తోటకూరలు యార్లగడ్డను శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు రావు కల్వల, సురేష్‌ కాజ, అనంత్‌ మల్లవరపు, శ్రీమతి శశికళ తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X