కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఒక పరుగు తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. ఢిల్లీ కేపిటల్స్ ప్రస్థానం 209 రన్స్ వద్ద ఆగిపోయింది. చివరి పరుగుకోసం ప్రయత్నించిన కుల్ దీప్ యాదవ్ రనౌట్ కావడం మలుపు తిప్పింది. గుజరాత్ కు విజయాన్ని అందించింది.
ఇన్నింగ్స్ కీలక దశలో ఢిల్లీ కేపిటల్స్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ రిటైర్డ్ హర్ట్ గా మైదానాన్ని విడిచిపెట్టాల్సి రావడం ఒకరకంగా ఓటమికి బాటలు వేసినట్టయింది. 10 బంతుల్లో 12 పరుగులు చేసిన మిల్లర్ 13వ ఓవర్లో రిటైర్డ్ హర్ట్ గా డగౌట్ చేరాడు. అప్పటికి ఢిల్లీ జట్టు స్కోరు 130/3. ఈ పరిణామం అభిమానులను, జట్టు మేనేజ్మెంట్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

డేవిడ్ మిల్లర్ వికెట్ల మధ్య దూకుడుగా పరుగులు తీస్తున్నప్పుడు తన చేతికి గాయం అయినట్లు కనిపించింది. అంతకుముందు ఫీల్డింగ్ సమయంలో బంతిని అందుకునేందుకు డైవ్స్ చేశాడు. అప్పుడు గాయపడ్డా ఫీల్డింగ్ కొనసాగించాడు. 13వ ఓవర్లో మిల్లర్ గ్లోవ్స్ తీసి, బొటనవేలును పట్టుకుని అసౌకర్యంగా కనిపించాడు. నొప్పితో విలవిల్లాడాడు. రన్ తీసే క్రమంలో క్రీజ్ చేరుకోవడానికి డైవ్ చేశాడు. దీంతో బొటనవేలికి దెబ్బ తగిలింది.
మిల్లర్ వెనుదిరిగిన వెంటనే అక్షర్ పటేల్ బ్యాటింగ్‌కు దిగాడు. ఛేజింగ్ లో ట్రిస్టన్ స్టబ్స్ అవుట్ అయిన తర్వాత డేవిడ్ మిల్లర్ మళ్లీ బ్యాటింగ్ కు దిగాడు. గాయంతో ఇబ్బంది పడుతూనే ఛేజింగ్‌ను కొనసాగించాడు. 16.4 ఓవర్ల వద్ద ఢిల్లీ స్కోరు 161/5 వద్ద ఉన్నప్పుడు గెలవడానికి 20 బంతుల్లో 50 పరుగులు అవసరమైన అత్యంత కీలకమైన సమయంలో అతను కేఎల్ రాహుల్‌తో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
స్కోర్ సమం చేయడానికి ఒక పరుగు చేస్తే చాలనుకునే సమయంలో ఇన్నింగ్ చివరి బంతిని ఎదుర్కొన్నాడు డేవిడ్ మిల్లర్. ప్రసిద్ధ్ వేసిన ఓవర్ అది. స్లోయర్ బౌన్సర్ గా వేసిన ఆ డెలివరీని షాట్ ఆడబోయాడు గానీ బంతి తగల్లేదు. అది నేరుగా వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతిలో వాలింది. అయినప్పటికీ పరుగు తీయడానికి ప్రయత్నించాడు. నాన్ స్రైకింగ్ ఎండ్ వైపు నుంచి కుల్ దీప్ యాదవ్ సకాలంలో క్రీజ్ కు చేరుకోలేకపోయాడు. ఈ లోపే బట్లర్ వికెట్లను గిరాటేయడంతో ఢిల్లీ కేపిటల్స్ ఓటమి పరిపూర్ణమైంది.
గాయంతో ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేసిన డేవిడ్ మిల్లర్ ను గుజరాత్ కేప్టెన్ శుభ్ మన్ గిల్, సిరాజ్, జోస్ బట్లర్, కగిసొ రబడ, ఇతర ప్లేయర్లందరూ ఓదార్చడం కనిపించింది. అసాధారణ ఇన్నింగ్ ఆడినందుకు భుజం తట్టి మెచ్చుకున్నారు. అనంతరం గ్రౌండ్ లోకి వచ్చిన అక్షర్ పటేల్.. మిల్లర్ ను ఆప్యాయంగా పలకరించాడు.
-
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
DC vs GT: ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా ? ఆ రెండు బాల్స్ ..! -
గిదేం ఆట సామీ?: నువ్వు తోపువనుకుంటే తుస్సుమన్నావ్ కదా! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ టీమ్ మారబోతున్నాడా ? భారత మాజీ హింట్..! -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై..












Click it and Unblock the Notifications