ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!!
T20 World Cup Final India Vs New Zealand: మరో ఉత్కంఠ పోరుకు సర్వం సిద్దం అవుతోంది. టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచేందుకు అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ పోరు జరగనుంది. టీమిండియా - న్యూజీలాండ్ మధ్య జరిగే ఈ తుది పోరు పైన అభిమానుల్లో భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. తుది జట్టు కూర్పు పైన టీమిండియా మేనేజ్ మెంట్ కసరత్తు చేస్తోంది. ఇక్కడ టాస్ తో పాటుగా వాతావరణం కీలకంగా మారుతోంది. ఫైనల్ వర్షం కారణంగా జరగ్గపోతే.. ఫలితం ఏంటో ఐసీపీ తాజా రూల్స్ స్పష్టం చేస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ గా టీమిండియా నిలుస్తుందా. క్రికెట్ ఫ్యాన్స్ ఈ ఫైనల్ కోసం వేచి చూస్తున్నారు. అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తున్న కివీస్ తో టీమిండియా తుది పోరు ఆడనుంది. టీమిండియాలో లోపాలే ఇప్పుడు ఫ్యాన్స్ ను కలవరానికి గురి చేస్తున్నాయి. బౌలింగ్ లో బూమ్రా మినహా ఎవరూ రాణించటం లేదు. ఓపెనింగ్ డాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ నిరాక పరుస్తున్నాడు. సంజూ పైన బ్యాటింగ్ భారం ఎక్కువగా కనిపిస్తోంది.

ఒత్తిడి తో ఆడే ఫైనల్ లో టీమిండియా సమిష్టి గా రాణిస్తేనే... కివీస్ లాంటి జట్టు పైన పై చేయి సాధించే ఛాన్స్ ఉంటుంది. కివీస్ పైన అభిషేక్ కు మంచి రికార్డు ఉంది. దీంతో.. ఫైనల్ లో అయినా అభిషేక్ రాణిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సెమీస్ లో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, ఈ మ్యాచ్ కు వర్షం అడ్డండికా మారితే ఫలితం ఎలా డిసైడ్ చేయాలో ఐసీసీ తాజా రూల్స్ స్పష్టం చేస్తున్నాయి.
వర్షంతో మ్యాచ్ రద్దయితే.. ఫలితం ఇలా
అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్ వేళ వర్షం కురిస్తే రిజర్వ్ డేను ఐసీసీ ఖరారు చేసింది. మ్యాచ్ రోజున ఏ కారణం చేతనైనా మ్యాచ్ పూర్తి కాకపోయినా లేదా అసలు ప్రారంభం కాకపోయినా, ఆ మ్యాచ్ను రిజర్వ్ డేన నిర్వహిస్తారు. ఈ లెక్కన మ్యాచ్ మళ్ళీ మార్చి 9న జరుగుతుంది లేదా పూర్తి చేస్తారు. రేపు (ఆదివారం) షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ పూర్తి చేయడానికి 120 నిమిషాల అదనపు సమయం కేటాయించారు.
కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉన్నా, అదే రోజు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అది కూడా సాధ్యం కాని పక్షంలోనే మ్యాచ్ రిజర్వ్ డేకి మారుతుంది. ఒకవేళ మ్యాచ్ సగం పూర్తయి ఆగిపోతే, మిగిలిన భాగాన్ని మరుసటి రోజున కొనసాగిస్తారు. అప్పటి కీ మ్యాచ్ నిర్వహణకు పరిస్థితులు అనుకూలించక పోతే మాత్రం.. ఫైనల్స్ కు చేరిన ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. దీంతో.. ఇండియన్ ఫ్యాన్స్ మ్యాచ్ జరగాలని... టీమిండియా తిరిగి ప్రపంచ ఛాంపియన్ గా నిలవాలని కోరుకుంటున్నారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications