IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!
ఐపీఎల్ 2026 సీజన్‌ను ముంబై ఇండియన్స్ ఘనంగా ప్రారంభించింది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో శుభారంభం చేసింది. చివరిసారిగా ఐపీఎల్ 2012 సీజన్‌లో శుభారంభం చేసిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత 13 సీజన్లలో తమ ఫస్ట్ మ్యాచ్ గెలవలేదు. తాజా సీజన్‌లో ఈ చెత్త రికార్డుకు హార్దిక్ సేన బ్రేక్ వేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ అజింక్యా రహానే (40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67), అంగ్‌క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) అర్ధ సెంచరీలతో రాణించారు. ఫిన్ అలెన్ (17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), రింకూ సింగ్ (21 బంతుల్లో 4 ఫోర్లతో 33 నాటౌట్) ధాటిగా ఆడారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3/35తో మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీశాడు.

221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 19.1 ఓవర్లలో ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసి మరో 5 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది.ఓపెనర్లు రోహిత్ శర్మ (38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78), ర్యాన్ రికెల్టన్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 81) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. తొలి ఓవర్ నుంచే కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఈ జోడీ, పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. రోహిత్ 23 బంతుల్లో, రికెల్టన్ 24 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
ర్యాన్ రికెల్టన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను కేకేఆర్ ఫీల్డర్లు జారవిడిచారు. సెంచరీ దిశగా సాగిన రోహిత్ శర్మను వైభవ్ అరోరా అవుట్ చేయడంతో 148 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (16) విఫలమవగా, అనూకుల్ రాయ్ స్టన్నింగ్ త్రోకు రికెల్టన్ రనౌటయ్యాడు.
విజయం ముంగిట తిలక్ వర్మ (20) వెనుదిరిగినా.. నమన్ ధిర్‌తో కలిసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా (18 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. కేకేఆర్ బౌలరలలో వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు.
-
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
IPL ఫ్యాన్స్ కు బిగ్ షాక్ - మ్యాచులకు దూరంగా ధోనీ, CSK అధికారిక ప్రకటన..!! -
కోహ్లీపై అంబటి కామెంట్స్- ఆ నిర్ణయంలో అర్థమే లేదు -
IPL 2026: ఆర్సీబీ శుభారంభం.. సన్‌రైజర్స్‌కు ఘోర పరాజయం -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications