Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్తాన్ చేతిలో భారత్ చారిత్రక ఓటమి: నక్వీ హైడ్రామా..!!

దుబాయ్‌లో వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్‌ ఓడిపోయింది. 191 పరుగుల భారీ తేడాతో భారత్ ను చిత్తు చేసి టైటిల్‌ను కైవసం చేసుకుంది పాకిస్తాన్. ఈ టైటిల్ ను కైవసం చేసుకోవడం పాకిస్తాన్ కు ఇది రెండోసారి. ఈ ఏకపక్ష పోరు భారత్‌కు ఒక పీడకలగా మిగిలింది. పాకిస్తాన్ విజయంలో సమీర్ మిన్హాస్ అద్భుతమైన బ్యాటింగ్ తో తడాఖా చూపాడు. 172 పరుగులు చేశాడు. బౌలింగ్ లో ఆలీ రజా నాలుగు వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. భారత్‌ను 156 పరుగులకే కట్టడి చేయడంలో దోహదపడ్డాడు.

తమ ఎనిమిదో ఆసియా కప్ టైటిల్ గెలుచుకోవాలనే ఆశలతో బరిలోకి దిగిన భారత్‌ను పాకిస్తాన్ అన్ని విభాగాల్లోనూ అధిగమించింది. పాకిస్తాన్ ఈ విజయం ద్వారా అండర్-19 ఆసియా కప్ చరిత్రలో తమ రెండో టైటిల్‌ను సాధించి చరిత్ర సృష్టించింది. గతంలో, 2012లో మలేషియాలోని కిన్నరా ఓవల్‌లో జరిగిన ఫైనల్ టైగా ముగియడంతో భారత్‌తో కలిసి పాకిస్తాన్ తొలిసారి టైటిల్‌ను పంచుకుంది. 13 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ మళ్ళీ ఈ కప్ ను గెలుచుకుంది.

Pakistan crushes India to win U19 Asia Cup by 191 runs

తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ 113 బంతుల్లో తొమ్మిది సిక్సర్లు, 17 ఫోర్లతో 172 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ ధాటికి బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కిషన్ సింగ్, ఆయుష్ మాత్రే, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్ భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. దేవేంద్రన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ రెండు చొప్పున వికెట్లు తీసుకున్నారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా తడబడింది. ఏ దశలో కూడా గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. జట్టు స్కోరు 32 పరుగుల వద్ద ఉన్నప్పుడు తొలి వికెట్ పడింది. కేప్టెన్ ఆయుష్ మాత్రే రెండు పరుగులే చేసి పెవిలియన్ దారి పట్టాడు. అక్కడ ఆరంభమైన వికెట్ల పతనానికి ఎక్కడే గానీ బ్రేక్ పడలేదు. క్రమం తప్పకుండా వికెట్లు పడ్డాయి. 120 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ పడిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్ దీపేష్ దేవేంద్రన్ కొంత ప్రతిఘటించాడు. 16 బంతుల్లో 36 పరుగులు చేశాడు. 26.2 ఓవర్లల్లో 156 పరుగులకు కుప్పకూలింది టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్. 191 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. పాకిస్తాన్ బౌలర్లల్లో అలీ రజా నాలుగు వికెట్లతో చెలరేగాడు. మహ్మద్ సయ్యం, అబ్దుల్ సుభాన్, హుజైఫా ఎహ్సాన్ రెండేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్స్‌ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద గెలుపు ఇదే. ఆసియా కప్ ఛైర్మన్ మొహసిన్ నక్వీ జట్టుకు విషెస్ చెప్పాడు. కప్ ను అందించాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+