• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పరిటాల హత్యమొద్దు శీను పనికాదా?

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 19-11-2005

;?

హైదరాబాద్‌:పరిటాల రవి హత్య ఉదంతంతో జూలకంటిశ్రీనివాసరెడ్డి అలియాస్‌ మొద్దు శీనుకుఎటువంటి సంబంధం లేదా? అతని భార్యలక్ష్మీరాజ్యం చెబుతున్నట్టు కొందరుపెద్దలు కేసును తప్పుదోవపట్టించడానికి శీనును పావులావాడుకున్నారా? ఈ కేసు దర్యాప్తులో సిబిఐనిర్లిప్తంగా వ్యవహరించడం, రాష్ట్ర పోలీసులుఅసలు పట్టించుకోకపోవడంతదితర విషయాలను బట్టి పరిటాలహత్యతో అతనికి సంబంధం లేదేమోనన్నఅభిప్రాయం బలపడుతోంది. శీనును పోలీసులే ఒకపావుగా వాడుకుని, నాటకీయ ఫక్కీలో ఒక టీవీ ఛానల్‌కుఇంటర్వ్యూ ఇప్పించినట్టు తెలుస్తోంది. పరిటాలరవిని తానే దగ్గర నుంచి కాల్చి చంపానని,సూరిబావ (పరిటాల రవి హత్యకేసులో ప్రధాన కుట్రదారు) కళ్ళల్లోమెరుపు చూడాలనే రవిని హత్య చేశానని, మరోఇద్దరిని హత్య చేసినతర్వాత పోలీసులకు లొంగిపోతాననిమొద్దు శీను రవి హత్య అనంతరంఆ టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన విషయంతెలిసిందే.

నిందితులనుపట్టుకోడానికి లక్‌ కూడా ఉండాలని పరిటాల రవిహత్య కేసును దర్యాప్తు చేస్తున్నసిబిఐ జాయింట్‌ డైరెక్టర్‌ వ్యాఖ్యానించడంతీవ్ర విమర్శలకు గురైంది. మొద్దుశీను ఢిల్లీ జీవితంపై సిబిఐ కంటే మీడియాపరిశోధనలు ఎంతో ముందు ఉండడంవిశేషం. మొద్దు శీను భార్యను సిబిఐ ఏమాత్రంవిచారించకపోవడం విడ్డూరంగా ఉంది.మొద్దు శీనుగాయపడి పోలీసులకు చిక్కాడని తెలిసినతర్వాత అనంతపురం జైలులో ఉన్నమద్దలచెరువు సూరి కంగారుపడినట్టు, ఆందోళన చెందినట్టు వార్తలువచ్చాయి. సూరి, ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి కుమారుడుజగన్మోహన్‌రెడ్డి మిత్రులని అందరికీతెలిసిన విషయమే. నిజాయితీకి, నిస్పాక్షికతకుమారుపేరైన సిబిఐఅధికారులు కొన్నిసార్లు అధికార పార్టీలఒత్తిళ్ళకు లొంగి దర్యాప్తులను నీరుగార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. పరిటాల రవిహత్య కేసు దర్యాప్తు విషయంలో కూడాఅదే జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

మొద్దుశీనుహైదరాబాద్‌లో, రాష్ట్రంలోని ఇతరప్రాంతాల్లో యధేచ్ఛగా తిరగడాన్ని బట్టిఅతనికి పోలీసుల పూర్తి మద్దతు ఉన్నట్టుఅనుమానాలు కలుగుతున్నాయి. సిబిఐఅధికారులపైనే వత్తిడి తేగగలిగినపెద్దలు రాష్ట్ర పోలీసుఉన్నతాధికారులను తమతాబేదారులుగా మార్చుకోవడంకష్టమైన విషయం కాదు. రవి హత్యకేసును నెత్తి మీద వేసుకుని నాటకీయఫక్కీలో మొద్దు శీను ఇచ్చిన ఇంటర్వ్యూను చూసిన వారికి అనేకఅనుమానాలుకలిగాయి. అతను సినిమా డైలాగులనువల్లించినట్టు మాట్లాడాడు. కరడుగట్టిన హంతకులు ఆ విధంగా మాట్లాడే అవకాశంలేదు. పరిటాలహత్య, తదనంతర పరిణామాలపైసుప్రీంకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణజరిపిస్తే వాస్తవాలు వెల్లడి కాగలవు.పెద్దల జాతకాలు బయట పడగలవు.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X