• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలకృష్ణ- ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ వెనుక ఎన్నో మలుపులు

By Santaram
|

Balakrishna-Jr Ntr
హైదరాబాద్: ఇది కూడా రాజకీయాలకు, సినిమాలకు ముడిపడిన ఉదంతమే. తెరచాటు విషయమే. జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు అనవసర ప్రాముఖ్యం ఇస్తున్నారని, పెద్ద ఎన్టీఆర్ కు అసలైన రాజకీయ నాయకుడిని తానేనన్నట్టు ఆ మధ్య జిల్లాల పర్యటనలో ఉన్నప్పుడు బాలకృష్ణ మీడియా ముందు ప్రకటనలు చేశారు. అవి కొన్ని టీవీ చానల్స్ లో ప్రచారమయ్యాయి. తన వియ్యంకుడైన చంద్రబాబును భయపెట్టడానికే ఆయన ఆ చిన్న బాంబులు పేల్చాడని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు స్వతహాగా పిరికి మనస్తత్వం కలవారన్న విషయం బాగా తెలిసిన బాలయ్య ఆయనకు ఈ ఝలక్ ఇచ్చి కంగారు పెట్టారు.

నిజంగా బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని ఉందా? నిజంగానే ఆయన చంద్రబాబును పక్కకు తప్పించాలనుకున్నారా? అందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మద్దతు ఉందా? ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలే. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న తనను తక్కువగా చూస్తున్నారన్న భావన బాలయ్య మనసులో కలిగింది. ఇటీవల 'సింహా' విజయంతో బాలకృష్ణ అనేక సినిమాలు ఒప్పుకుని ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. సింహ కూడా ఫ్లాప్ అయి ఉంటే ఆయన ఇప్పటికే సీరియస్ గా రాజకీయాలపై దృష్టి సారించేవాడు. హిట్ కావడంతో వచ్చే మూడేళ్ళ పాటు అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకు సినిమాల మీదనే దృష్టి పెట్టాలకుంటున్నారు.

అయితే చంద్రబాబు తన కంటే జూనియర్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. జూనియర్ పై ఆయన పరోక్ష యుద్ధం ప్రకటించినట్టు అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. మే 20న జూనియర్ పుట్టినరోజు వేడుక జరిగింది. దానికి బాలకృష్ణ ఎటూ హాజరు కాలేదు. చంద్రబాబు నాయుడు తన కుటుంబ సమేతంగా వెళ్ళాలనుకున్నా బాలయ్య హెచ్చరించడంతో వారు ఆగిపోయినట్టు తెలిసింది. అందువల్ల చంద్రబాబు ఒక చిన్న తెలుగుదేశం నాయకుడి ద్వారా బొకే పంపించి చేతులు దులుపున్నారు.

వాడుకుని వదిలేసే లక్షణం గల నాయకుడిగా చంద్రబాబును చాలా మంది తెలుగుదేశం నాయకులు పరోక్షంగా అభివర్ణిస్తుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే అభిప్రాయానికి వచ్చారట. గత ఎన్నికల్లో మండుటెండల్లో ప్రచారం చేసి, చివరికి అదే యాత్రలో జరిగిన యాక్సిడెంట్ లో ప్రాణాపాయం తెచ్చుకున్నా చంద్రబాబు నాయుడికి అభిమానం, వాత్సల్యం లేకుండా పోయాయన్న బాధ జూనియర్ ను వెంటాడుతోంది. బాబాయి బాలయ్య ఎన్ని బ్రేకులు వేసినా చంద్రబాబు తెలివి ఏమైపోతోందని ఆయన ఆవేదన చెందుతున్నారు. 'సింహ' కంటే పెద్ద విజయం ఇచ్చి బాబాయికి తన సత్తా ఏమిటో చెప్పాలని ఇప్పుడు తహతహలాడుతున్న జూనియర్ సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X