వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసిమానంద పాత్ర లేదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Asimanand Swami
మక్కా మసీదు పేలుళ్ల సంఘటనలో స్వామీ అసిమానాంద పాత్ర లేకపోవచ్చని ఓ ముస్లీం యువకుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాదుకు చెందిన షేక్ అబ్దుల్ కలీం అనే యువకుడు స్వామీ అసిమానందకు మక్కా పేలుళ్లలో క్లీన్ చిట్ ఇస్తున్నాడు. అబ్దుల్ కలీం ఈ వ్యాఖ్యలు చేయడంతో సిబిఐ పోలీసులు అసిమానందను బలవంతంగా ఒప్పించడమో లేదా మెంటల్‌గా ఆయనను మార్చి ఒప్పించడమే చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలు స్వామీజీ ఒప్పుకున్నాడా లేక ముస్లిం టెర్రరిజంపై ఎగుస్తున్న ఆగ్రహ జ్వాలల నేపథ్యంలో హిందూ టెర్రరిజాన్ని తెరపైకి తేవడానికి తెచ్చిన ప్రయత్నాల్లో భాగంగా అసిమానందను ఉపయోగించుకున్నారా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అబ్దుల్ కలీం అనే ముస్లిం యువకుడి మాటల ద్వారా ఇందుకు సంబంధించిన వార్తాకథనాన్ని ఓ తెలుగు టీవీ చానెల్ ప్రసారం చేసింది.

కొందరు పెద్దల హస్తం కారణంగా సిబిఐ పోలీసులు అసిమానంద మక్కా పేలుళ్లలో తాను ఉన్నట్లు ఒప్పుకున్నారని చెబుతున్నట్టుగా అనుమానాలు బలపడుతున్నాయి. గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ కూడా అసిమానంద ఒప్పుకోలుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసిమానందను బలవంతంగా ఒప్పించడమో లేకా ఆయన ఒప్పుకోకుండానే సిబిఐ పోలీసులు లీక్ పేరుతో హిందూ టెర్రరిజాన్ని తెరపైకి తీసుకు రావడమో జరిగిందని ఆరోపిస్తున్నారు. తాజా ముస్లిం యువకుడైన అబ్దుల్ కలీం వ్యాఖ్యలతో ఆర్ఎస్ఎస్ వాదనలకు బలం చేకూరాయి. ఉగ్రవాదులైన అఫ్జల్‌గురు, కసబ్‌ల విచారణకు సంబంధించిన అంశాలు బయటకు రానప్పుడు కేవలం అసిమానందవి మాత్రమే ఎందుకు వస్తాయని ఆర్ఎస్ఎస్ ప్రశ్నిస్తోంది. అంటే ఇందులో ఖచ్చితంగా కుట్ర దాగి ఉందని ఆర్ఎస్ఎస్ వాదిస్తోంది. అయితే ఉగ్రవాదులు ఎవరైనా శిక్షించాల్సిందేనని స్పష్టం చేస్తుంది. కానీ అసిమానంద కేసులో నిజం లేదని చెబుతోంది.

స్వామీ అసిమానందకు అబ్దుల్ కలీం చంచల్‌గూడ జైలులో పరిచయం అయ్యాడు. స్వామీ అసిమానంద జైలులో కలిసి ఉన్నప్పుడు ఆయన వ్యక్తిత్వం ఎంతో ఉన్నతంగా ఉండేదని చెబుతున్నాడంట. కలీం మహాత్మాగాంధీ లా కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఉగ్రవాదులకు సిమ్‌కార్డులు అందజేస్తున్నాడన్న కేసులో పోలీసులు కలీంను 2010 అక్టోబర్‌లో అరెస్టు చేశారు. కాగా మక్కా మసీదు పేలుళ్ల సందర్భంగా కలీంను కూడా పోలీసులు అరెస్టు చేసి విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ వాదనలు ఈ ముస్లిం యువకుడు చెప్పిన వ్యాఖ్యలు మరింత బలపరుస్తుండటంతో సిబిఐ తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సిబిఐ తీరుపై చాలా విమర్శలు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X