పాకిస్థానీయులకు పిచ్చెక్కిస్తున్న ఇండియన్ సినిమా..!
ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది 'మహావతార్ నరసింహ' చిత్రం. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా.. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. మహావిష్ణువు అవతారమైన నరసింహ స్వామి - భక్త ప్రహ్లాద కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండానే విడుదలైన ఈ యానిమేటెడ్ మూవీ.. కేవలం మౌత్ టాక్ ద్వారానే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ముఖ్యంగా ఈ సినిమాలో కథ, కథనం, అద్భుతమైన గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిజంగా నరసింహ స్వామి వచ్చి కనిపించాడా అన్న స్థాయిలో విజువల్స్ అదిరిపోయాయి. ఆ ఎలివేషన్ సీన్స్.. అందుకు తగ్గట్టుగా వచ్చే మ్యూజిక్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. యానిమేషన్ చిత్రాలంటే కేవలం చిన్నపిల్లల కోసమే అనుకునే ధోరణికి ఈ మూవీ ఫుల్ స్టాప్ పెట్టేసింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ మూవీని చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పుడు ఈ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది.

పాకిస్తాన్‌లోని కరాచీలో గల చారిత్రక శ్రీ స్వామినారాయణ మందిరంలో "మహావతార్ నరసింహ" ప్రదర్శించబడిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయం.. కరాచీలో మిగిలి ఉన్న కొన్ని క్రియాశీల హిందూ దేవాలయాలలో ఒకటిగా నిలుస్తుంది. ప్రస్తుతం భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా కూడా భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇండియన్ సినిమాకి పాకిస్థాన్ దేశంలో నీరాజనాలు పలకడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ యానిమేటెడ్ చిత్రం హిందూ ఇతిహాసాలపై ఆధారపడడంతో.. వేలాది మంది భక్తులు ఆలయం వద్దకు తరలివచ్చి సినిమాని వీక్షిస్తునట్టు చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి సమాచారం గానీ.. అధికారిక ధృవీకరణ గానీ ఇంకా లభ్యం కాలేదు. ఏ ప్రధాన వార్తా సంస్థ గానీ, ఆలయ అధికారిక వర్గాలు గానీ ఈ ప్రదర్శన జరిగినట్లు నిర్ధారించలేదు. దీంతో అసలు ఈ వ్యవహారం నిజమేనా కాదా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇందుకు సంబంధించిన వీడియోలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి.
HISTORIC NIGHT IN KARACHI!
— ಸನಾತನ (@sanatan_kannada) December 1, 2025
Mahavatar Narasimha animated movie screened for the FIRST TIME EVER at Swaminarayan Mandir Karachi!🕉️
Thousands of devotees, hearts on fire, divine energy everywhere! 🙏#MahavatarNarasimha #KarachiMandir #PakistanHinduPride #JaiShriHari pic.twitter.com/Zo9PfmMcvP
మరోవైపు లేటెస్ట్ గానే ఈ మూవీ మరో ఘనత సాధించింది. 98వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. యానిమేషన్ కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్ లో ఎంట్రీ పొందింది. ఈ విషయాన్ని అకాడమీ అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది. మహావతార్ నరసింహా సినిమా ఆస్కార్ కు ఎంపికవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
నేనేం పతివ్రతను కాదు - బుల్లితెర బ్యూటీ -
7.5 గంటల సినిమా? ఇండియన్ సినీ హిస్టరీలో బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications