థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే
తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటివరకు ఎవరూ ఊహించని విధంగా 70MM 6-ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్‌తో వచ్చిన తొలి సంచలన చిత్రం 'సింహాసనం'. దీన్ని భుజాన వేసుకొని, భారీగా ఖర్చుచేసి, ప్రేక్షకులకు మరపురాని అనుభూతి అందించిన ఏకైక సూపర్ స్టార్ కృష్ణ. ఈ స్థాయి సాంకేతికతను తట్టుకునే థియేటర్లు అప్పట్లో ఆంధ్రాలో లేవు. కానీ, కృష్ణ పట్టుబట్టి భారీగా ఖర్చు చేసి గుంటూరు, విజయవాడ, వైజాగ్, కాకినాడ, హైదరాబాద్, నెల్లూరు వంటి ప్రధాన కేంద్రాల్లోని థియేటర్ల స్క్రీన్లను, సౌండ్ సిస్టమ్‌ను స్వయంగా ఆధునికీకరించారు. ఖర్చు కూడా ఆయనే పెట్టుకున్నారు. సినిమా తీయడమే కాదు, తెలుగు ప్రేక్షకులకు ప్రపంచస్థాయి అనుభూతిని అందివ్వాలని ఎంతో తపన పడ్డారు. అది నెరవేర్చి చూపించారు.
చేతిలో సినిమా టికెట్ ఉంటేనే అనుమతించేవారు
ఈ సినిమా క్రేజ్ అప్పట్లో ఏ స్థాయిలో ఉందంటే.. విజయవాడ అలంకార్ థియేటర్ వద్ద 95 అడుగుల భారీ కటౌట్, బెంజ్ సర్కిల్లో 75 అడుగుల కటౌట్లను ఏర్పాటు చేశారు. ఆ కటౌట్లను చూడటానికే వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. రద్దీ ఎంతగా ఉండేందంటే.. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం పోలీసులకు అసాధ్యంగా మారింది. దీంతో తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా ఒక చిత్రం కోసం థియేటర్ల పరిసరాల్లో 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. చేతిలో సినిమా టికెట్ ఉంటేనే ఆ వీధిలోకి అనుమతించే వారు. ఆ క్రేజ్ ను బట్టి 'సింహాసనం' సృష్టించిన సునామీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

కావాలనే మందాకినిని తీసుకున్నారు
ఈ చిత్రంలో అప్పటికే కృష్ణ-శ్రీదేవి హిట్ కాంబినేషన్‌కు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, కృష్ణ ఎప్పటిలానే ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. హిందీలో 'రామ్ తేరీ గంగా మెయిలీ'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మందాకినిని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఫ్రెష్‌గా ఉంటుందనే ఉద్దేశంతో శ్రీదేవి స్థానంలో ఆమెను తీసుకున్నారు. జయప్రద, రాధ వంటి అగ్ర హీరోయిన్లతో పాటు, మహారాణి పాత్రలో వహీదా రెహమాన్ ఈ చిత్రానికి మరింత హుందాతనాన్ని తెచ్చారు. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన కృష్ణ సంగీత దర్శకుడిగా బప్పిలహరిని ఎంచుకున్నారు. హిందీలో జితేంద్రతో ఈ సినిమా నిర్మించారు. హీరోయిన్లు మాత్రం వారే ఉన్నారు.
50 లక్షలతో సినిమా తీయడం ఎక్కువ అనుకునే రోజుల్లో 4 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి వారంలోనే సగం బడ్జెట్‌ను రాబట్టింది. పౌరాణిక, జానపద అంశాలను కలగలిపిన కృష్ణ మాయ 'సింహాసనం' గ్రాఫిక్స్ లేని ఆ కాలంలోనే ఒక విజువల్ వండర్‌గా నిలిచింది. పద్మాలయా స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లు, అద్భుతమైన యుద్ధ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులకు కళ్లముందు కదలాడుతుంటాయి. అందుకే తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ ఎవర్ గ్రీన్ హీరోగా నిలిచిపోతారు.
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ!












Click it and Unblock the Notifications