Amazon: విశాఖకు అమెజాన్ బిగ్ న్యూస్..! 100 కోట్ల టార్గెట్- 833 జాబ్స్..!
ఏపీలో ఇన్నాళ్లూ వాణిజ్య రాజధానిగా పేరుతెచ్చుకున్న విశాఖపట్నం ఇప్పుడు టెక్ రాజధానిగా అభివృద్ధి చెందుతోంది. తాజాగా పెట్టుబడుల సదస్సులో వచ్చిన కంపెనీల ప్రతిపాదనలు, అంతకుముందే గూగుల్ డేటా సెంటర్ కోసం జరిగిన ఒప్పందం, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి దిగ్గజాల విస్తరణ ప్రతిపాదనల మధ్య తాజాగా మరో గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే విశాఖలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకుని 300కు పైగా ఉద్యోగాలు వర్క్ ఫ్రం హోం పద్దతిలో కల్పించిన అమెజాన్ ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది.
విశాఖలో తాజాగా టెక్ కంపెనీల రాకతో జోష్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ ను విస్తరించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)లో మరోసారి రిజిస్ట్రేషన్ చేయించింది. గతంలో పెట్టిన పెట్టుబడులకు అదనంగా రెట్టింపు పెట్టుబడులతో అమెజాన్ ఈసారి ముందుకొస్తోంది. దీంతో పాటు భారీగా ఉద్యోగాల కల్పనకూ అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం నగరంలోని సిరిపురం వద్ద తాత్కాలిక కార్యాలయంలో 300 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తున్న అమెజాన్ మూడేళ్లలో దాన్ని విస్తరించి నగరంలోనే భారీ ఆఫీసు ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం ఎస్టీపీఐలో రీరిజిస్ట్రేషన్ చేయించింది. ఈ విస్తరణ వల్ల వచ్చే మూడేళ్లలో విశాఖలో 833 ఉద్యోగాల కల్పనకు అమెజాన్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. దీంతో అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ రాక తర్వాత నగరంలో విస్తరణ ప్రణాళికలు చేపడుతున్న ఇతర దిగ్గజ సంస్థల సరసన చేరబోతోంది. తద్వారా తమ ఈ-కామర్స్ ఎగుమతుల్ని 100 కోట్లకు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది.
-
డిగ్రీ అర్హత ఉంటే చాలు.. భారీ జీతంతో ఉద్యోగాలు ! -
రెడ్మీ 15A 5G రూ. 12,999 మాత్రమే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications