రూ.69,100 జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. DON'T MISS
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నిరుద్యోగులకు తీపి కబురు ప్రకటించింది. స్పోర్ట్స్ కోటాలో నియామకాల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ సరిహద్దుల భద్రతతో పాటు క్రీడారంగంలో ప్రతిభ చూపిన యువతకు అవకాశం కల్పిస్తుంది. మొత్తం 549 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇవి గ్రూప్ 'C' నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులు కావడం విశేషం. ఇందులో 277 పోస్టులు పురుషులకు, 272 పోస్టులు మహిళలకు కేటాయించారు.
అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి (10వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా, గుర్తింపు పొందిన క్రీడల్లో ప్రతిభ కలిగి ఉండాలి. అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, హాకీ, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, షూటింగ్, జూడో, కరాటే, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, సైక్లింగ్ వంటి క్రీడలలో పాల్గొన్న అనుభవం తప్పనిసరి. గత రెండేళ్లలో జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించినవారు లేదా ఆ స్థాయి పోటీల్లో పాల్గొన్నవారు అర్హులుగా పరిగణించబడతారు.

వయోపరిమితి..
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం & ఫీజు..
ఈ నియామకాలకు ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు గడువు..
డిసెంబర్ 27, 2025 నుంచి జనవరి 15, 2026 వరకు
దరఖాస్తు రుసుము..
జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.159 చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ..
ఈ నియామకాలలో ప్రత్యేకత ఏమిటంటే రాత పరీక్ష లేదు.
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఈ దశల ద్వారా జరుగుతుంది:
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
క్రీడా ప్రదర్శన ఆధారిత మెరిట్ లిస్ట్
ధ్రువపత్రాల పరిశీలన (డాక్యుమెంట్ వెరిఫికేషన్)
వైద్య పరీక్ష (మెడికల్ టెస్ట్)
జీతభత్యాలు..
ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-3 ప్రకారం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ప్రాథమిక జీతం లభిస్తుంది. దీనితో పాటు
డీఏ (Dearness Allowance),
హెచ్ఆర్ఏ,
వైద్య సౌకర్యాలు,
పెన్షన్,
ఇతర కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications