Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.1,56,400 జీతంతో 2499 ఉద్యోగాలు.. DON'T MISS

కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ దేశవ్యాప్తంగా 2499 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అర్హులైన బోధన, బోధనేతర సిబ్బందిని నియమించుకోనుంది. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇది బయట అభ్యర్థులకు కాకుండా, సంస్థలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రత్యేక ప్రమోషన్ ఛాన్స్ కావడం ఒక ముఖ్యాంశం.

ఈ ఉద్యోగ నియామకాలు ప్రధానంగా Limited Departmental Competitive Examination (LDCE), Limited Departmental Examination (LDE) విధానాల ద్వారా జరగనున్నాయి. ఈ పరీక్షల ప్రధాన లక్ష్యం ప్రస్తుత KVS ఉద్యోగులను పదోన్నతి పొందేలా చేయడం. ముఖ్యంగా 2026 డిసెంబర్ నాటికి ఖాళీ కానున్న ఫైనాన్స్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ వంటి కీలక పరిపాలనా పోస్టులను LDCE ద్వారా నింపనున్నారు. ఇప్పటికే అధ్యాపకులు, పరిపాలనా సిబ్బందిగా పనిచేస్తున్న వారికి కెరీర్ గ్రోత్‌కు గోల్డెన్ ఛాన్స్ గా నిలువనుంది.

kendriya-vidyalaya-sangathan-notification-for-2499-jobs

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీలు..

2499

బోధనా పోస్టులు (Teaching Posts)..

  • ప్రిన్సిపాల్
  • వైస్ ప్రిన్సిపాల్
  • PGT (Post Graduate Teachers)
  • TGT (Trained Graduate Teachers)
  • హెడ్ మాస్టర్

పరిపాలనా పోస్టులు (Non-Teaching Posts)..

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO)
  • సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (SSA)
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)
  • ఫైనాన్స్ ఆఫీసర్
  • సెక్షన్ ఆఫీసర్
  • స్టెనోగ్రాఫర్, సపోర్ట్ స్టాఫ్ వంటి మరికొన్ని టెక్నికల్ పోస్టులు కూడా ఉండే అవకాశముందని తెలుస్తోంది.

అర్హతలు..

అభ్యర్థులు అప్లై చేయాలంటే విద్యార్హతలు పోస్టు నిబందనలకు అనుగుణంగా ఉండాలి.

JSA వంటి పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది.

TGTలకు గ్రాడ్యుయేషన్ + B.Ed తప్పనిసరి

PGTకు మాస్టర్స్ + B.Ed

ప్రిన్సిపల్/వైస్ ప్రిన్సిపాల్‌కు టీచింగ్ అనుభవం, B.Ed, మాస్టర్స్ విద్యార్హత అవసరం

అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు గ్రాడ్యుయేషన్, సంబంధించిన అనుభవం ఉండాలి

వయస్సు..

అభ్యర్థుల వయస్సు 26 డిసెంబర్ 2025 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు రాయితీలు వర్తిస్తాయి.

ఎంపిక ప్రక్రియ..

రాత పరీక్ష

స్కిల్ టెస్ట్ (స్టెనోగ్రాఫర్/క్లర్క్ పోస్టులకు)

డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఆరోగ్య పరీక్ష (Medical Test)

పరీక్షలు కంప్యూటర్ ఆధారిత (CBT) మోడ్‌లో నిర్వహించే అవకాశం ఉంది. అభ్యర్థుల ప్రతిభ, అనుభవం, సీనియారిటీ వంటి అంశాలను కలిపి మెరిట్ జాబితాను తయారు చేస్తారు.

జీతం..

ఆకర్షణీయమైన వేతనాలు - రూ.19,900 నుండి రూ.1,56,400 వరకు

ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ 7వ వేతన కమిషన్ ప్రకారం వేతనం ఇవ్వబడుతుంది.

జూనియర్ క్లర్క్ పోస్టులకు : రూ.19,900 నుంచి ప్రారంభం

ప్రిన్సిపల్/PGT/TGT/ఆఫీసర్ గ్రేడ్ పోస్టులకు: రూ.1,56,400 వరకు

అదనంగా DA, HRA, TA, PF, NPS, మెడికల్ అలవెన్సులు వంటి పలు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

దరఖాస్తు ప్రక్రియ..

అభ్యర్థులు KVS అధికారిక వెబ్‌సైట్ https://kvsangathan.nic.in/ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు గడువు..

12 డిసెంబర్ 2025 నుంచి 26 డిసెంబర్ 2025 వరకు

అదనపు ముఖ్య సమాచారం..

  • నియామకాలలో రాష్ట్ర ప్రాధాన్యత ఇవ్వబడే అవకాశం KVS నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
  • ఒకసారి ఎంపికైన తర్వాత దేశవ్యాప్తంగా ఏ KVలోనైనా పనిచేయాల్సి రావచ్చు.
  • అన్ని పరీక్ష వివరాలు, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ లను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో జారీ చేయనున్నారు.
  • ఇప్పటికే పనిచేస్తున్న KV ఉద్యోగులు తమ స్కూల్/రిజియన్ కార్యాలయం ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చు.
  • LDE/LDCE పరీక్షలు వార్షిక క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తారు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+