నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఆర్ఆర్బీ జాబ్ క్యాలెండర్ రిలీజ్..!
నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తీపికబురు ప్రకటించింది. 2026 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సమగ్రమైన వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో ఉన్న ఖాళీలను దశలవారీగా భర్తీ చేయాలనే లక్ష్యంతో ఈ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువతకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఫిబ్రవరి - అసిస్టెంట్ లోకో పైలట్..
ఈ వార్షిక క్యాలెండర్ ప్రకారం 2026 ప్రారంభం నుంచే నోటిఫికేషన్ల వరుస మొదలుకానుంది. ఫిబ్రవరి నెలలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇది టెక్నికల్ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం. ఆ తర్వాత మార్చి నెలలో టెక్నీషియన్ విభాగాల్లో ఉన్న వేల సంఖ్యలో ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పోస్టులు ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు ప్రత్యేకంగా ఉపయోగపడనున్నాయి.

ఏప్రిల్ - సెక్షన్ కంట్రోలర్ పోస్టులు
ఏప్రిల్ నెలలో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. ఈ పోస్టులు రైల్వే ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించేవిగా ఉండటంతో, అనుభవం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉండనుంది.
జూలై - పారామెడికల్ స్టాఫ్ & జూనియర్ ఇంజనీర్
జూలై నెలలో పారామెడికల్ స్టాఫ్‌తో పాటు జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రైల్వే ఆసుపత్రులు, సాంకేతిక విభాగాల్లో ఉద్యోగాలు కోరుకునే వారికి ఇది మంచి అవకాశంగా నిలుస్తుంది.
ఆగస్టు - నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్
ఆగస్టు నెలలో అత్యంత క్రేజ్ ఉన్న నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) నోటిఫికేషన్ వెలువడనుంది. ఇది గ్రాడ్యుయేట్లు, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులకు అత్యంత కీలకమైన నోటిఫికేషన్‌గా భావిస్తున్నారు.
సెప్టెంబర్ - మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు
సెప్టెంబర్ నెలలో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీల పోస్టుల భర్తీ జరగనుంది.
అక్టోబర్ - గ్రూప్-డీ
అక్టోబర్ నెలలో భారీ స్థాయిలో అభ్యర్థులు ఎదురుచూసే గ్రూప్-డీ (లెవల్-1) పోస్టుల నోటిఫికేషన్ విడుదల కానుంది.
గతంలో నోటిఫికేషన్ల విషయంలో అనిశ్చితి ఉండేదని, కానీ ఇప్పుడు ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టత రావడంతో చదువుపై మరింత దృష్టి పెట్టవచ్చని అభ్యర్థులు చెబుతున్నారు. రైల్వే పరీక్షల్లో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ ముఖ్యమైన అంశాలు కావడంతో, వీటిపై ఇప్పటి నుంచే గట్టి పట్టు సాధించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications