బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ "రితికా నాయక్"..
యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్న కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజకీయ, గ్యాంగ్‌స్టర్ అంశాలతో కూడిన పీరియడ్ డ్రామాగా రూపొందనున్న 'పవర్ పేట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విభిన్న కథలను ఎంచుకునే దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా.. ఇండస్ట్రీలో ఈ కాంబినేషన్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి. కృష్ణ చైతన్య మార్క్ డైలాగ్స్, సందీప్ కిషన్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, పీరియడ్ యాక్షన్ ఎలిమెంట్స్.. ఒక డిఫరెంట్ మూవీగా నిలబెట్టే అవకాశముంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, త్వరలో అధికారిక ప్రకటనతో పాటు షూటింగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
హీరోయిన్గా రితికా నాయక్..
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సందీప్ సరసన Ritika Nayak హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. 'అశోకవనంలో అర్జున కళ్యాణం'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రితికా, 'హాయ్ నాన్న', 'మిరాయ్' వంటి చిత్రాలతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. 'పవర్ పేట'లో ఆమె పాత్రకు కథలో బలమైన ప్రాధాన్యత ఉండడంతో, ఎమోషనల్ మరియు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్‌గా ఉండబోతుందని టాక్. విజువల్‌గా కూడా ఈ చిత్రం చాలా గ్రాండ్‌గా ఉండబోతోందని, రియలిస్టిక్ సెట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమా మొదట మరో హీరోతో తెరకెక్కించాలని భావించినా.. అనుకోని కారణాలతో ప్రాజెక్ట్ సందీప్ కిషన్ వద్దకు వచ్చింది. మొదట ఈ కథను మూడు భాగాలుగా తెరకెక్కించే ఆలోచన ఉన్నప్పటికీ, కథలో మార్పులు చేసి ఒకే పార్ట్‌గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీ నిర్మితమవుతోంది.
సందీప్ కెరీర్‌కు కీలక చిత్రం..
Prasthanam తర్వాత సందీప్‌కు ప్రత్యేకమైన నటుడిగా గుర్తింపు వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో తనదైన స్టైల్‌ను కొనసాగించారు. ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఆయన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో 'పవర్ పేట' ఆయన కెరీర్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
సందీప్ ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు'. అలానే Jason Sanjay దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం 'సిగ్మా'. అంతే కాకుండా తన సొంత బ్యానర్ వెంకటాద్రి టాకీస్‌లో మరో రెండు కొత్త సినిమాలు.. ఈ ప్రాజెక్ట్స్‌తో పాటు 'పవర్ పేట' షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
-
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
నేనేం పతివ్రతను కాదు - బుల్లితెర బ్యూటీ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా












Click it and Unblock the Notifications