నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక సినిమా కోసం ఎంతలా కష్టపడతారో మనకు తెలిసిందే. సెలబ్రిటీ కుటుంబం నుంచి వచ్చినా ఆయన పడే కష్టం అంతా ఇంతా కాదు.. గంగోత్రి సినిమా నుంచి ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ పాన్ ఇండియాలో ప్రముఖ హీరోగా వెలుగొందుతున్నారు. ఆయన పడిన కష్టానికి నిదర్శనమే పుష్ప సినిమాకు గాను నేషనల్ అవార్డు రావడం. అటు డ్యాన్స్ అయినా ఫైట్స్ అయినా బన్నీ మార్క్ అందులో కనిపిస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్.
అయితే అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇప్పుడు తండ్రికి తగిన కుమార్తెగా ప్రశంసలు అందుకుంటోంది. నాలుగేళ్ల వయసులోనే ప్రపంచ రికార్డులు బద్ధలు కొడుతోంది అల్లు అర్హ. ఇంత చిన్న వయసులో ఆమెకు ఇది ఎలా సాధ్యం అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాన్నే టాలెంటెడ్ అనుకుంటే, అల్లు అర్హ ఇంకా గొప్ప టాలెంటెడ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మేరకు అల్లు అర్హకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి అల్లు అర్హ ఇంత సాధించింది ఏంటో తెలుసా..?
చాలా క్యూట్ గా కనిపిస్తూ.. ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది అల్లు అర్హ. సోషల్ మీడియా లో ఈ చిన్నారికి సంబంధించిన వీడియోలు ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అల్లు అర్హ తాజాగా తన బర్త్ డే ను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకుంది. ఆమె తాజాగా నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఇంత చిన్న వయసులో అసాధ్యమైన రికార్డును నెలకొల్పింది అల్లు అర్హ. ప్రఖ్యాత నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

ఇక అల్లు అర్హకు చెస్ గేమ్ లో ఎంతో ప్రతిభ ఉందట. ఈ చిన్నారి అద్భుతంగా చెస్ ఆడటమే కాకుండా 50 మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అల్లు అర్హ.. హైదరాబాద్ లోని హైటెక్ సిటీకు చెందిన రాయ్ చెస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంది. అయితే కేవలం 2 నెలల్లోనే ఈ చిన్నారి దాదాపుగా 50 మందికి ట్రైనింగ్ ఇచ్చి చరిత్ర సృష్టించినట్లు సమాచారం. ఇంత చిన్న వయసులో అంత మందికి ట్రైనింగ్ ఇవ్వడం కారణంగా ఆమెకు ఈ అవార్డు లభించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అల్లు అర్హపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications