'అవతార్ 3' దెబ్బకు జేమ్స్ కామెరూన్ సంచలన నిర్ణయం..!
హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ టెర్మినేటర్, టైటానిక్, అవతార్ లాంటి చిత్రాలను చూస్తేనే ఆయన మేకింగ్ ఏంటో విజన్ ఏంటో అర్థమైపోతుంది. ఆయన సినిమాలు అంటేనే ఓ వైపు బాక్సాఫీస్ ఊచకోత.. మరోవైపు డజన్లకొద్దీ ఆస్కార్ అవార్డులు.. ఒక్కో సినిమాకు ఒక్కో ప్రపంచాన్ని సినీ ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ప్రపంచంలోనే దిగ్గజ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. 2009 లో ఆయన నుంచి వచ్చిన అవతార్ చిత్రం.. ఎవరూ కలలోనూ ఊహించని కొత్త ప్రపంచం..
2009లో విడుదలైన ఈ అవతార్ మూవీ ఓ అద్భుతం. ప్రపంచ సినీ చరిత్రలో ఓ సంచలనంగా నిలిచింది. జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ కు యావత్ ప్రపంచం ఫిదా అయింది. ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ కు టచ్ చేసే సినిమా రాలేదంటే ఆయన దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో అర్థం అవుతుంది. ఈ చిత్రం అఖండ విజయం తర్వాత సుదీర్ఘంగా చిత్రీకరించిన ఆ మూవీ సీక్వెల్ అవతార్ ది వే ఆఫ్ వాటర్..
అవతార్ ది వే ఆఫ్ వాటర్ 2022 డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ కూడా ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మొదటి భాగం అడవుల నేపథ్యంలో సాగితే.. ఈ రెండో భాగం పండోరా గ్రహంలోని సముద్రతీరంలోని తెగలు.. నీటి అడుగున ఉండే అద్భుత ప్రపంచం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకు కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. దీంతో అదే ఉత్సాహంతో ఇటీవల ఈ సిరీస్ నుంచి మూడో చిత్రంగా అవతార్: ఫైర్ అండ్ యాష్ ను తీసుకొచ్చారు.

ఈ అవతార్: ఫైర్ అండ్ యాష్ మూవీ డిసెంబర్ 19 న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ సారి జేమ్స్ కామెరూన్ మాయాజాలం ఫలించలేదు. ఇంతుకుముందు చూసిన రెండు సినిమాలనే మళ్లీ చూస్తున్న ఫీలింగ్ రావడంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయింది. దాంతో అవతార్ సిరీస్ లో భాగంగా రావాల్సిన అవతార్ 4, అవతార్ 5 సినిమాలను నిలిపివేయాలని డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఓ ఎంటర్ టైన్ మెంట్ వీక్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా కామెరూన్ బయటపెట్టినట్లు సమాచారం అందుతోంది. మరో కొత్త కథ ఏదైనా తీసే యోచనలో జేమ్స్ కామెరూన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరికొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.
-
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
ఓటీటీలోకి రాధిక బ్లాక్ బస్టర్ మూవీ.. ఇప్పుడే చూసేయండి..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications