Champion Twitter Review: శ్రీకాంత్ కొడుకు హిట్టు కొట్టాడు భయ్యా..!
తెలంగాణ చరిత్ర, తెలంగాణ అస్తిత్వం మీద తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తెలంగాణ జలియన్ వాలాబాగ్ గా పేరుగాంచిన సిద్దిపేట జిల్లాలోని బైరాన్ పల్లి యథార్థ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని తీసిన చిత్రం ఛాంపియన్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు కోటికిపైగా వ్యూస్ వచ్చాయి. అటు సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2025 న థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ మూవీతో శ్రీకాంత్ కొడుకు రోషన్ హిట్టు కొట్టాడా..?
ఛాంపియన్ మూవీని తెలంగాణ జలియన్ వాలాబాగ్ గా చెప్పుకునే సిద్దిపేట జిల్లా బైరాన్‌పల్లి యథార్థ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని.. ఈ కథకు ఫుట్ బాల్ అంశాన్ని జోడించి తీశారు. లెజెండరీ నిర్మాత అశ్వినీదత్ స్థాపించిన వైజయంతీ మూవీస్ బ్యానర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించాడు. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. డైరెక్టర్ గా ప్రదీప్ కు ఇది తొలి సినిమా కావడం విశేషం.
డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం.. ఇదివరకు పలు సినిమాలకు రైటర్ గా పనిచేశారు. అద్వైతం అనే షార్ట్ ఫిల్మ్ తో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం అంతకుముందు సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ కు రైటర్ గానూ పని చేశారు. ఇక డైరెక్టర్ గా ఆయనకు తొలి సినిమా అయినా.. తీసిన విధానంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. యథార్థ సంఘటనను అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.

దాదాపు 2 గంటల 49 నిమిషాల రన్ టైమ్ ఉన్న సినిమా మేకింగ్ పరంగా గ్రాండ్ గా ఉన్నట్లు సమాచారం. సినిమా క్వాలిటీ బాగుందని టాక్ వినిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. ఎమోషన్స్ కూడా బాగా పండాయట. ఇక క్లైమాక్స్ లో ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ అని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజైన పాటలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. సాంగ్స్ బిగ్ స్క్రీన్ పై బ్యూటిపుల్ గా ఉన్నాయని సమాచారం. ఛాంపియన్ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
#Champion Inside talk : 2 hrs 40 mins bomma.. U/A...
— Tollymasti (@tollymasti) December 24, 2025
Quality next level undi anta cinema.. Especially production values.. 🔥🔥🔥Emotions.. + Climax lo twist ramppp adisthay anta.. 👌👌👌 Waiting to watch the film.. @tollymasti #tollymasti #ChampionOnDec25th
మొత్తానికి శ్రీకాంత్ కొడుకు రోషన్.. ఛాంపియన్ మూవీతో సూపర్ హిట్ కొట్టాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రోషన్ నటన చాలా సహజంగా ఉందని చెబుతున్నారు. ఇక సినిమా పూర్తి రివ్యూ కోసం మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
-
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications