'ధురంధర్' రికార్డుల్ని బద్దలు కొట్టిన కొత్త సినిమా..
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్' మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ మూవీ రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజ్ అయి 7 వారాలు కావొస్తున్నా ఇప్పటికీ భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న సినిమా ఇప్పటికీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది. ఇప్పటివరకూ ఈ మూవీ రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది.
దేశభక్తి నేపథ్యంలో..
ఇక దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం'బోర్డర్ 2'. ఈ మూవీ భారీ అంచనాల మధ్య జనవరి 22న థియేటర్లలో రిలీజైంది. విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రం తొలి రోజే భారతీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 30 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. దీంతో గతేడాది రిలీజైన 'ధురంధర్' తొలి రోజు కలెక్షన్లు రూ. 28.60 కోట్లను అధిగమించి రికార్డును క్రియేట్ చేసింది.
ఇక బోర్డర్ 2 సినిమా.. 1971 భారత-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్ పార్ట్ లాంగేవాలా యుద్ధం మీద దృష్టి పెడితే.. ఈ మూవీ సీక్వెల్ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో జరిపిన పోరాటాలను చూపిస్తుంది. పాకిస్థాన్.. భారత్ పై ఆకస్మికంగా జరిపిన వైమానిక దాడుల తర్వాత భారత సైన్యం ఎలా తిప్పికొట్టింది అనేది ఈ కథలో ప్రధానంగా ఉంది.
గల్ఫ్ దేశాల్లో వివాదం
మరోవైపు ఈ చిత్రంపై గల్ఫ్ దేశాల్లో వివాదం నెలకొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేస్తూ అక్కడి ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు పాకిస్థాన్ వ్యతిరేక ధోరణిలో ఉన్నాయనే కారణంతో సెన్సార్ అనుమతి నిరాకరించినట్లు సమాచారం.

ఈ మూవీలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దొసాంజ్, అహన్ శెట్టి లు కీలక పాత్రల్లో నటించారు. బోర్డర్ 2 మూవీకి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి క్రిటిక్స్ నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది.
-
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications