Bigg Boss 9 Winner: టైటిల్ విన్నర్ గా కళ్యాణ్
దాదాపు 104 రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్ బాస్ సీజన్ 9 నేటితో ముగిసిపోయింది. తనూజ, కళ్యాణ్ మధ్య హోరాహోరీ జరిగిన ఫైనల్ లో కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ గా నిలిచాడు. దాంతో తనూజ, కళ్యాణ్, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజనలలో ట్రోఫీ ఎవరికీ దక్కబోతోందనే ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతం స్టార్ మా, ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ లో రాత్రి 7 గంటల నుండి బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం అవుతోంది.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమో ఫుల్ ఎంటర్ టైనింగ్ తో పాటుగా ఎమోషనల్ గానూ ఉంది. ఇక కింగ్ నాగార్జున.. తన ఇటీవలి మూవీ కూలీలోని సైమన్ లుక్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఫినాలేకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మర్యాద మనీష్, దివ్వెల మాధురి, నిఖిల్ నాయర్, ప్రియ, సుమన్ శెట్టి, రమ్య మోక్ష, సాయి శ్రీనివాస్, సైని, దమ్ము శ్రీజ, హరిత హరీష్, గౌరవ్, రీతూ చౌదరి, రాము రాథోడ్, భరణి, ఆయేషా, దివ్య నిఖిత.. అందరూ వచ్చారు.
అలాగే తనూజ, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్, డీమాన్, సంజన.. ఐదుగురు తమ స్పెషల్ పెర్ ఫార్మెన్స్లతో అందరనీ ఆశ్చర్య పరిచారు. తర్వాత బిగ్‌బాస్ 9 ట్రోఫీని నాగార్జున చూపించారు. రెండు చేతుల పైన బట్టర్ ఫ్లై ఆకారంలో ఈ ట్రోఫీ ఉంది.

ప్రైజ్ మనీ ఎంత..?
బిగ్ బాస్ విన్నర్‌కు ప్రైజ్ మనీ ఎంత ఉండబోతుందనే అంశంపై ప్రేక్షకుల్లో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గత సీజన్లో విజేతగా నిలిచిన నిఖిల్ కు రూ.55 లక్షల నగదు బహుమతి ప్రకటించారు మేకర్స్. ఈ నగదుతో పాటు ఒక కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా కారు, సువర్ణభూమి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తరపున 600 చదరపు గజాల ఓపెన్ ప్లాట్, జోయాలుక్కాస్ నుండి 15 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు సొంతం చేసుకున్నాడు. ఈ బహుమతుల మొత్తం విలువ సుమారు 1 కోటి 25 లక్షల రూపాయల పైనే ఉంటుందని అంచనా. అయితే బిగ్ బాస్ 9 విన్నర్ కు ఎంత బహుమతి అందుతుందనే టాక్ నడుస్తోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications