ప్రభాస్ 'స్పిరిట్' ఫస్ట్ లుక్.. మరికొన్ని గంటల్లో..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ స్పిరిట్. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయింది. 'యానిమల్', 'కబీర్ సింగ్' భారీ విజయాల తర్వాత సందీప్ రెడ్డి వంగా చేస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై రెబల్ ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులు కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీసు పాత్రలో కనిపించనున్నారు.
స్పిరిట్ మూవీలో ప్రభాస్ పాత్ర చాలా ఆసక్తికరంగా, డిఫరెంట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు చిత్ర మేకర్స్. ఈ విషయాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో మరికొన్ని గంటల్లో విధ్వంసం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ ఫస్ట్ లుక్ ఒక్కటే కాదు.. రిలీజ్ డేట్ కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
సందీప్ రెడ్డి హీరోలు అంటేనే ఓ రేంజ్ లో ఉంటారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల్లో హీరోలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో సందీప్ చూపించారు. దాంతో ప్రభాస్ ఫస్ట్ లుక్ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. 2026 న్యూ ఇయర్ కానుకగా ఈమూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ లుక్ ట్రెండింగ్ లోకి వచ్చి రచ్చ రచ్చ చేసేలా కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియా నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. చేతిలో సిగార్ తో షర్ట్‌లెస్ గా బ్లడ్ బాత్ అనేలా ప్రభాస్ లుక్ ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో మరి కొన్ని గంటల్లో తేలనుంది.

ఇక ఈ చిత్రంలో.. ప్రభాస్ తొలిసారిగా పోలీసు పాత్రలో కనిపించనున్నారు. అతని పాత్ర ఈ మూవీలో చాలా డిఫరెంట్ గా ఉండనున్నట్లు టీజర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. డార్లింగ్ కు జోడీగా 'యానిమల్' ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటించనుంది. అలాగే ఈ మూవీలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
-
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!












Click it and Unblock the Notifications