సంక్రాంతి 2026 విన్నర్ ఎవరో తేల్చేసిన ఆడియన్స్..?
సంక్రాంతి వచ్చిందంటే చాలు అనేక సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సంక్రాంతి టార్గెట్ గా ఎక్కువగా పెద్ద హీరోల సినిమాలే రిలీజ్ అవుతుంటాయి. వీటి మధ్యలో ఒకట్రెండు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి. ఈసారి సంక్రాంతికి కూడా చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. మరి వాటిలో ప్రేక్షకులు ఏ సినిమాకు జై కొట్టారు..? బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ ఏది..?
ఈసారి సంక్రాంతికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రానికి మొదటి రోజు భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించ లేకపోయిన నేపథ్యంలో క్రమంగా కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం రాజాసాబ్ వసూళ్లు భారీగా పడిపోయినట్టు తెలుస్తోంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైంది. ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మూవీకి క్యూ కడుతున్నారు. మొదటి రోజు ఈ చిత్రానికి ఏకంగా రూ. 84 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. రెండు రోజుల్లో ఏకంగా రూ. 120 కోట్ల వసూళ్లతో మెగాస్టార్ మూవీ దూసుకెళ్తోంది. ఈ మూవీ ఫుల్ రన్ లో రూ. 500- 600 కోట్ల వద్ద ఆగుతుందని తాజాగా చిత్ర నిర్మాత అంచనా వేశారు.
ఇక మాస్ మహారాజ రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా సంక్రాంతి కానుకగా జనవరి 13 న విడుదలైంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్స్ ఆశించినంతగా నమోదు కావట్లేదు. సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అయిన నేపథ్యంలో కలెక్షన్స్ తగ్గినట్లు తెలుస్తోంది. అలాగే రవిటైజ్ గత చిత్రాలు కమర్షియల్ గా ఫ్లాప్ అవ్వడం వల్ల వాటి ప్రభావం ఈ సినిమాపై పడినట్లు సమాచారం.

నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైంది. హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మెగాస్టార్ సినిమాకు టికెట్స్ దొరకనివాళ్లు ఈ సినిమాకు వెళ్లే ఛాన్స్ ఉంది. చిరంజీవి సినిమా తర్వాత సంక్రాంతి విన్నర్ రేసులో ఈ మూవీ రెండో స్థానంలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే రోజు శర్వానంద్ నారీనారీ నడుమ మురారీ సినిమా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ టాక్ తెలియాల్సి ఉంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications