"సోగ్గాడు" ఈజ్ బ్యాక్.. శోభన్ బాబు అభిమానులకు ఫుల్ క్రేజీ అప్డేట్ !!
తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన హీరోల్లో "అందాల నటుడు" శోభన్‌బాబు ఒకరు. ఈ స్టార్ హీరో అసలు పేరు శోభనా చలపతిరావు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తర్వాత అదే స్థాయిలో.. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. తనదైన నటనతో, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ మహానటుడుకి.. సపరేట్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆయన కెరీర్లో ఎన్నో చిత్రాలు ఘనవిజయాలు సాధించి తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా నిలిచాయి. కానీ శోభన్ బాబు మాత్రం తన కుటుంబ సభ్యులను సినిమా రంగానికి పరిచయం చేయలేదు.
కాగా శోభన్‌బాబు కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన చిత్రాల్లో "సోగ్గాడు" ఒకటి. 1975 డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కె.బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. రామానాయుడు నిర్మించారు. జయసుధ-జయచిత్ర హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీతో శోభన్ బాబుకు అటు మాస్ ఫాలోయింగ్ తో పాటు.. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా బాగా వచ్చింది.

కాగా ఈ ఏడాది డిసెంబర్ 19తో ఈ చిత్రం విడుదలై 50 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ మేరకు మైలురాయిని పురస్కరించుకొని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. శ్రేయాస్ మీడియా సౌజన్యంతో సురేశ్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. అందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో స్వర్ణోత్సవాల అధికారిక పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భం గా నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ.. సోగ్గాడు చిత్రం తమ బ్యానర్‌కు అపారమైన గౌరవం తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు. సురేశ్ ప్రొడక్షన్స్ స్థాపించిన తొలి దశలో నిర్మించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిందని చెప్పుకొచ్చారు. అలానే ఈ వేడుకలో పాల్గొన్న రచయిత పరుచూరి గోపాలకృష్ణ, శోభన్‌బాబుతో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని హృద్యంగా స్మరించుకున్నారు. సినీ రంగానికి శోభన్‌బాబు అందించిన సేవలు చిరంజీవిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి కె. మురళీమోహన్రావు, రేలంగి నరసింహారావు, గద్దె నవీన్, సుధాకర్‌బాబు, సాయి కామరాజు, విజయ్ కుర్రా రాంబాబు తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలు శోభన్‌బాబు సినీ వారసత్వానికి అద్భుతమైన నివాళిగా నిలవనున్నాయని వెల్లడించారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !!












Click it and Unblock the Notifications