గ్రాండ్‌గా రిలీజ్ రెడీ అయిన 'ఇట్లు మీ ఎదవ'
ఈ మధ్యకాలంలో యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు వస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఆ కోవలోనే, 'సంజీవని ప్రొడక్షన్స్' బ్యానర్ పై బళ్లారి శంకర్ నిర్మిస్తున్న 'ఇట్లు మీ ఎదవ' సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే అంచనాలను పెంచగా, ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థల భాగస్వామ్యంతో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
ఈ చిత్రానికి బిజినెస్ పరంగా భారీ మద్దతు లభించింది. నైజాం (నిజాం) ప్రాంతంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP విడుదల చేస్తుండగా, ఆంధ్ర మరియు సీడెడ్ ప్రాంతాలలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ రిలీజ్ చేయనుంది. ఈ రెండు అగ్రశ్రేణి సంస్థలు డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకోవడంతో 'ఇట్లు మీ ఎదవ'కు మంచి థియేటర్ల సంఖ్య లభించనుంది.

ఈ చిత్రానికి R P పట్నాయక్ సంగీతం అందించగా, పాటలు , నేపథ్య సంగీతంపై మంచి అంచనాలు ఉన్నాయి.జగదీష్ చీకటి డీఓపీగా, ఉద్ధవ్ SB ఎడిటర్‌గా వ్యవహరించారు.
ఈ సినిమాలో కథకు బలం చేకూర్చేలా అనుభవజ్ఞులైన నటీనటులు కీలక పాత్రలు పోషించారు. తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ వంటి సీనియర్ నటులు ఉండగా, హాస్యాన్ని పండించేందుకు తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్ వంటి ప్రముఖ కమెడియన్లు కూడా భాగమయ్యారు. నవంబర్ 21న థియేటర్లలో సందడి చేయనున్న ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్రేక్షకుల ఆదరణను ఏ మేరకు పొందుతుందో చూడాలి.
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ!











Click it and Unblock the Notifications