తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా!
తెలంగాణ సర్కారు 2025 ఏడాదికి గానూ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ ఫిల్స్ అవార్డుల్లో 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. చిన్న సినిమాగా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ప్రభుత్వ పురస్కారాలను కూడా కొల్లగొట్టి తన సత్తా చాటింది. ఒకే సినిమాకు రెండు కీలక విభాగాల్లో అవార్డ్స్ దక్కడం పట్ల సినీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
రెండు విభాగాల్లో సత్తా చాటిన'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'
రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో 7పీ.ఎం. ప్రొడక్షన్ బ్యానర్‌పై సందీప్ అగరం నిర్మించిన ఈ సినిమాకు రెండు ప్రధాన కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. ఉత్తమ చిత్రాల విభాగంలో 'థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్'గా నిలిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే విధంగా సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన మాస్టర్ రోహన్ రాయ్‌కు 'బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్' అవార్డు దక్కింది. చిన్న వయసులోనే ఎంతో పరిణతితో కూడా నటనతో ఆకట్టుకున్న రోహన్ రాయ్‌పై ప్రశంసలు జల్లు కురుస్తోంది.

పల్లెటూరి నేపథ్యం.. పక్కా వినోదం
తెలంగాణ సంస్కృతిని, సినిమా కళను గౌరవించే క్రమంలో ప్రభుత్వం ఈ ఏడాది నుంచి గద్దర్ పేరిట ఈ అవార్డులను ప్రారంభించింది. మొదటి ఏడాదే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' వంటి చిన్న సినిమా పెద్ద గుర్తింపు సాధించడం విశేషం. గతేడాది నవంబరు 7న విడుదలైన ఈ కామెడీ డ్రామా.. స్వచ్ఛమైన పల్లెటూరి నేపథ్యం, కుటుంబ విలువల కలబోతగా రూపొందింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా.. ఓటీటీలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కేవలం వినోదమే కాకుండా.. కథలో ఉన్న సహజత్వం కారణంగా ఈ సినిమాకు గద్దర్ అవార్డుల రూపంలో తగిన గుర్తింపు లభించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హర్షం వ్యక్తం చేసిన చిత్రబృందం
ఈ విజయం పట్ల చిత్ర దర్శకులు, నిర్మాతలు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరిన్ని వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చిన్న సినిమాను ది గ్రేట్ అనిపించిన ప్రేక్షకులకు నిర్మాత సందీప్ అగరం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాగాయకుడు గద్దర్ పేరిట ఈ గౌరవప్రదమైన పురస్కారాన్ని అందుకోవడం తమ బ్యానర్ కు గర్వకారణమన్నారు. ఇదే ఉత్సాహంతో 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్ నుంచి ఈ ఏడాది మరో రెండు భారీ ప్రాజెక్టులను సందీప్ అగరం ప్రకటించారు. అందులో ఒకటి టాలీవుడ్ యంగ్ హీరోతో ఉండగా.. మరొకటి తమిళ అగ్ర హీరోతో చర్చల దశలో ఉన్నట్లు వెల్లడించారు.
-
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
అడవి శేష్ 'డెకాయిట్' మూవీ సెన్సార్ టాక్ ఇదే..! -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
ఒక్క వెబ్ సిరీస్ తోనే పిచ్చెక్కించే షాక్ ఇచ్చిన బ్యూటీ.. -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా?












Click it and Unblock the Notifications