Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైరల్ వీడియో: నిధి అగర్వాల్ ను ఊపిరాడకుండా చేశారేంటి..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ మూవీపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు ఫ్యాన్స్ తో సినీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కు సిద్దమవుతోంది. ఈ క్రమంలో రాజా సాబ్ చిత్రం నుంచి రెండో సాంగ్ ను తాజాగా హైదరాబాద్ KPHBలోని లులూ మాల్‌ లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

అయితే ఈ వేడుకలో టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇటీవల హరిహర వీరమల్లు చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రభాస్ తో జతకట్టింది. అయితే రాజా సాబ్ నుంచి రెండో పాట రిలీజ్ కోసం ఆమె KPHBలోని లులూ మాల్‌ కు వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

The Raja Saab Actress Nidhhi Agerwal Mobbed by Overzealous Fans Unpleasant Encounter Goes Viral

ఈవెంట్ అనంతరం నిధి అగర్వాల్ బయటకు వెళ్తుండగా ఒక్కసారిగా పెద్దఎత్తున ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టారు. ఆమెతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. దీంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒకింత ఆమెకు ఊపిరాడకుండా చేశారు. దీంతో ఎంతో నిరుత్సాహంతో ఆమె కారులోకి చేరుకున్నారు. అక్కడే ఉన్న బాడీగార్డులు ఆమెకు హెల్ప్ చేసి కారులోకి ఎక్కించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అలా మీదపడి పోతారేంట్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రాజాసాబ్ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. మరి కొద్ది రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా హైదరాబాద్ లోనే నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి వస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే గానీ జరిగితే ప్రభాస్, చిరంజీవి ఇద్దరు బిగ్ స్టార్స్ ను ఒకే వేదికపై చూసే భాగ్యం కలుగుతుంది. ఇక ఈ మూవీ ప్రీమియర్స్ జనవరి 8 న పడనున్నట్లు చిత్ర నిర్మాత ఇప్పటికే తెలిపారు. దీంతో రెబల్ ఫ్యాన్స్ సినిమా రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+