Fact Check : రాఫెల్ విమానం అక్కడ కూలిపోయిందా..?
భారత అమ్ములపొదిలో తిరుగులేని అస్త్రంగా,రక్షణ రంగంలో గేమ్ చేంజర్‌గా చెబుతున్న రాఫెల్ యుద్ద విమానాలకు సంబంధించి ఓ ఫేక్ న్యూస్ తెర పైకి వచ్చింది. తొలి విడతగా భారత్ చేరిన 5 రాఫెల్ యుద్ద విమానాలను గోల్డెన్ యూరోస్ స్క్వాడ్రన్‌కి అప్పగించిన నేపథ్యంలో... అందులో ఓ విమానం సాంకేతిక సమస్య కారణంగా అంబాలా ఎయిర్ బేస్‌లో కుప్పకూలినట్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది.
అంబాలా ఎయిర్ బేస్‌లో యుద్ద విమానం కూలిపోయిందని,ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయాడని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. వైరల్ అవుతున్న ఫోటో మార్ఫింగ్ అని స్పష్టం చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా విమానం కూలిపోయిందని ఎక్కడా ట్వీట్ చేయలేదని తెలిపింది.

కాగా,ఈ ఏడాది జులైలో ఫ్రాన్స్ నుంచి తొలి విడతగా ఐదు రాఫెల్ యుద్ద విమానాలు భారత్ చేరిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో భారత్ మొత్తం 36 యుద్ద విమానాల కోసం రూ.56వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.
గురువారం(సెప్టెంబర్ 10) ఆ ఐదు యుద్ద విమానాలను అధికారికంగా ఎయిర్‌ఫోర్స్‌కి అప్పగించారు. మిగతా 31 యుద్ద విమానాలు కూడా భారత్‌కు వస్తే ఎయిర్‌ఫోర్స్ రంగంలో ఇక భారత్‌కు తిరుగులేదని చెబుతున్నారు.
Claim:An alleged tweet by @IAF_MCC claims that a combat aircraft Rafale jet has crashed near Ambala Airbase due to technical fault and a pilot is martyred#PIBFactCheck: The image is #Morphed. No such tweet has been posted by IAF. Also, no such incident has taken place#FakeNews pic.twitter.com/QDMbzNHQ7U
— PIB Fact Check (@PIBFactCheck) September 11, 2020

Fact Check
వాదన
రాఫెల్ యుద్ద విమానం అంబాలా ఎయిర్ బేస్‌లో కూలిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం.
వాస్తవం
రాఫెల్ యుద్ద విమానం కూలిపోయినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. అందులో ఏమాత్రం నిజం లేదు.
రేటింగ్
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications