వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిక్సర్ల గేల్ దూకుడు వెనుక సీక్రెట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chris Gayle
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ తన దూకుడు వెనుక ఉన్న సీక్రెట్‌ను తెలిపారు. భారీ షాట్లు కొట్టాలంటే శరీరాన్ని సరైన సంతులనంతో ఉంచుకోవడం చాలా ముఖ్యమని, షాట్‌కు అ నుగుణంగా శరీరాన్ని నియంత్రించుకోగలిగితే ఎన్ని సిక్సర్లయినా కొట్టవచ్చునని, బ్యాలెన్స్ చేసుకోవడం పై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిడు. అయితే, భారీ షాట్లు బాదడానికి బౌలర్లు ఎప్పుడూ చెత్త బంతులు వేయరని గుర్తుంచుకోవాలని సూచించాడు.

కొత్త షాట్లను సృష్టించగలిగితే, బాదడంలో సఫలమైనట్టే. ఇందుకు మానసికంగా సన్నద్ధమవడం ఎంతో అవసరమని, షాట్ ఎంపిక, ఫుట్‌వర్క్ కూడా ముఖ్యమని, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిక్సర్ కొడుతున్నారు. పెద్దపెద్ద బ్యాట్లతో ఆడితే ఇదేమంత కష్టం కాదని, బౌండరీ బాదడం చాలా ఈజీ అని, మొదట ప్రయత్నించాలని, దానిపై కఠోర సాధన చేయాలని, ఒక్కసారి సఫలమైతే పరిస్థితులకు అనుగుణంగా రాణించవచ్చునని, అందరి బౌలింగ్‌లోనూ బాదేయవచ్చునని తెలిపాడు.

టి-20 ప్రపంచ కప్ గెలుస్తామా లేదా అన్న విషయం గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని, మా జట్టు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందని, నాణ్యమైన స్పిన్నర్లు, ఫాస్ట్‌బౌలర్లూ ఉన్నారని, గ్రూప్ దశ దాటడం గురించే ప్రస్తుతం దృష్టి సారిస్తున్నట్లు తెలిపాడు. తమ లక్ష్యాన్ని అంచల వారీగా మార్చుకుంటామని, ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ కఠినమైనదని, ఈ మ్యాచ్ మాకు చాలా కీలకమైనదన్నాడు. ఈ మ్యాచ్ విజయం సాధించి ఆత్మవిశ్వాసం పొందడం ఎంతో అవసరమన్నాడు.

గేల్ దూకుడు ప్రపంచవ్యాప్తంగా అందరి క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. గేల్ అంటే స్టేడియం పైకప్పును తాకేలా అతను సంధించే భారీ సిక్సర్లు గుర్తుకొస్తాయి. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే విధ్వంసక విన్యాసాలు కళ్లు ముందు కనిపిస్తాయి. గేల్ క్రీజులో ఉన్నాడంటే స్టేడియం పరుగుల తుఫాన్‌తో హోరెత్తిపోవాల్సిందే. ప్రత్యర్థి విజయంపై ఆశలు వదులుకోవాల్సిందే. ముఖ్యంగా ధనాధన్ టి-20ల్లో.అంతర్జాతీయ ఈవెంట్లయినా.. ఐపిఎల్, బిగ్‌బాష్, బిపిఎల్ వంటి టోర్నీలేవైనా సరే... ఈ జమైకా వీరుడు బరిలో ఉన్నాడంటే అతని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆస్వాదించేందుకు అభిమానులు రెడీగా ఉంటారు.

ప్రపంచ క్రికెట్లో ధోనీ, సెహ్వాగ్, యువరాజ్, డివిల్లీర్స్, బ్రెండన్ మెకల్లమ్, వాట్సన్, పీటర్సన్.. ఇలా ఎందరో పించ్ హిట్టర్లు ఉన్నారు. సిక్సర్లు సంధించడంలో ఎవరి స్టయిల్ వారిది. అయితే, గేల్ శైలి మరింత విభిన్నం. సింగిల్ తీసినంత తేలిగ్గా బంతిని స్టాండ్స్‌లోకి కొడుతుంటాడు. క్రిస్ పెద్దగా శ్రమించినట్టు కూడా అనిపించదు. ఒక్కోసారైతే బంతిని పగలగొట్టాలన్నంత కసిగా ఒకే ఓవర్లో సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతాడు. పోనీ గేల్ ఏమన్నా నవ యువకుడా అనుకుంటే శుక్రవారం 34 ఏట అడుగుపెడుతున్నాడు.

English summary
West indies cricketer Chris Gayle revealed his secret behind sixes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X