వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ యువకుడి ధైర్యం, కొత్త 'ఐడియా': రూ.కోటితో ఈ-బిజినెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ జిల్లా మచ్చుపహాడ్ గ్రామానికి చెందిన కేశిరెడ్డి రాజిరెడ్డి అనే యువకుడు అంచెలంచెలుగా ఎదిగి.. ఇప్పుడు ఓ కంపెనీని స్థాపించి పదిమందికి ఉద్యోగం కూడా కల్పించే స్థాయికి ఎదిగాడు. తండ్రి మృతి అనంతరం కష్టాలు వెంటాడాయి. అయినా చెక్కు చెదరని ధైర్యంతో రాజిరెడ్డి అంచెలంచెలుగా ఎదిగాడు.

రూ.1200 జీతం స్థాయి నుంచి అతను ఎదిగాడు. ఈ కామర్స్ బిజినెస్ కంపెనీని స్థాపించిన కేశిరెడ్డి రాజిరెడ్డి.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. మార్కెటింగ్‌లో రాణిస్తున్న ఆయనను చూసి స్నేహితులు, గ్రామస్తులు గర్వపడుతున్నారు. ఆయన స్థాపించిన ఈ కామర్స్ సంస్థ www.adrobe.in (యాడ్రోబ్).

రాజిరెడ్డిది వరంగల్ జిల్లా నర్మెట్ట మండలం మచ్చుపహాడ్ గ్రామం. తండ్రి మృతి తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. తల్లి ఇబ్బందులు పడుతూ ఆయనను చదివించింది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఇంటర్‌తోనే విద్యాభ్యాసం ఆపేశాడు.

యాడ్రోబ్

యాడ్రోబ్

ఆ తర్వాత ప్రయివేటు ఉద్యోగం కోసం వేట మొదలు పెట్టాడు. వరంగల్ జిల్లాలో, హైదరాబాదులలో ఉద్యోగాలు చేశాడు. ఓ వైపు ప్రయివేటుగా ఉద్యోగం చేస్తూనే చదువును మాత్రం అశ్రద్ధ చేయలేదు. ఉస్మానియా పీజీఆర్ఆర్సీడీఈ ద్వారా ఓపెన్ డిగ్రీ, ఆ తర్వాత బీసీజే పూర్తి చేశాడు.

యాడ్రోబ్

యాడ్రోబ్

కొంతకాలానికి మీడియాలో వచ్చి పడ్డాడు. ఉద్యోగం చేస్తూనే ఎల్ఎల్‌బీ, ఎంబీయే పూర్తి చేశాడు. పలు దినపత్రికలలో పని చేశాడు. ఆ తర్వాత 2015లో కోటి రూపాయల పెట్టుబడితో యాడ్రోబ్ సంస్థను ప్రారంభించాడు. ఆయనకు అది అతి పెద్ద మొత్తమే.

యాడ్రోబ్

యాడ్రోబ్

కానీ ముందు నుంచి ఆయనకు ధైర్యం చేయడం అలవాటు. ధైర్యం చేయడంతో పాటు ఎందులోనైనా రాణించడం కోసం లేదా విజయం సాధించడం అహర్నిశలు కృషి చేస్తాడు. ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగుతాడు. ఎన్ని సమస్యలు వచ్చినా వెనుకడుగు వేయడు.

యాడ్రోబ్

యాడ్రోబ్


అదే ధైర్యాన్ని యాడ్రోబ్ ప్రారంభించడంలోను చూపించాడు. అతని పైన విశ్వాసంతో కొందరు పెట్టుబడులు పెట్టారు. పన్నెండు వందల జీతం నుంచి, ఆ తర్వాత ఐదంకెల జీతం అందుకున్నాడు. ఐదంకెల జీతంతో ఆయన హాయిగా జీవించవచ్చు.

 యాడ్రోబ్

యాడ్రోబ్

కానీ ఆయన లక్ష్యం వ్యాపారం. దాంతో మరో పదిమందికి ఉపాధి కల్పించవచ్చుననేది ఆయన ఆలోచన. యాడ్రోబ్‌ను.. వ్యాపారం చేయాలని, ఉపాధి కల్పించాలనే కోరిక ఉన్నంత మాత్రాన రూ.కోటి పెట్టి బిజినెస్ ప్రారంభించడం సామాన్య విషయం కాదు.

యాడ్రోబ్

యాడ్రోబ్

రాజిరెడ్డి ఎన్నో ఆలోచనలు చేసి విభిన్నంగా ఆలోచించాడు. ఇంతవరకు రాని యాడ్ కామర్స్ బిజినెస్ సైట్‌ను ప్రారంభించాడు. ఇది నిజంగా ఆయన కొత్త ఆలోచన అని చెప్పవచ్చు! మామూలుగా మనం ఈ కామర్స్ బిజినెస్ సైట్లు చూస్తుంటాం. కానీ ఇది యాడ్ కామర్స్ బిజినెస్.

 యాడ్రోబ్

యాడ్రోబ్

ఇది చూడడానికి ఈ కామర్స్ బిజినెస్ లాగ ఉన్నప్పటికీ.. యాడ్ కామర్స్ బిజినెస్. యాడ్రోబ్‌లో వస్తువుల డిస్ ప్లే‌తో పాటు వాటికి సంబంధించిన దుకాణానికి సంబంధించిన యాడ్స్ కనిపిస్తాయి. మరో విషయమేమంటే.. ఇందులో మనకు దొరకని వస్తువు అంటూ ఉండదని చెప్పవచ్చు.

 యాడ్రోబ్

యాడ్రోబ్

ఒకవేళ యాడ్రోబ్‌లో మీకు ఏ వస్తువైనా లేదు అనుకుంటే... అందుకు కూడా మీకు ఆప్షన్ ఉంది. యాడ్రోబ్ ద్వారానే దానిని కొనుక్కోవచ్చు. సాధారణంగా అన్ని ఈ కామర్స్ పోర్టళ్లు కొన్నింటికి పరిమితమై ఉన్నాయి. కానీ ఇందులో మాత్రం నిత్యావసర వస్తువుల నుంచి మొదలు మొబైల్స్ వరకు అన్ని లభిస్తాయి. ఓ విధంగా చెప్పాలంటే.. ఇంట్లో కూర్చొని ప్రతి వస్తువును తెప్పించుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాదులో చాలామందికి చేరువైన యాడ్రోబ్ త్వరలో వరంగల్ సహా పలు పట్టణాలకు విస్తరించనుంది.

English summary
Adrobe to start its operation in Warangal soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X