హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో రైలు: ఒక్కో స్టేషన్‌కు ఒక్కో ప్రత్యేకత, అందరినీ అలరించే సదుపాయాలు..

మెట్రో రైలు ప్రారంభం ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భాగ్యనగర వాసులు. ప్రపంచంలోనే మన మెట్రో లాంటిది మరొకటి లేదంటూ వార్తలు వస్తుండడంతో నగరవాసులు మురిసిపోతున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Hyderabad Metro New Twist | Oneindia Telugu

హైదరాబాద్ : మెట్రో రైలు ప్రారంభం ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భాగ్యనగర వాసులు. ప్రపంచంలోనే మన మెట్రో లాంటిది మరొకటి లేదంటూ వార్తలు వస్తుండడంతో నగరవాసులు మురిసిపోతున్నారు.

హైదరాబాద్ మెట్రో రైలు: సీటు దొరికితే అదృష్టమే! ప్రతి రైలుకు మూడే కార్లు, ఇవీ విశేషాలు..హైదరాబాద్ మెట్రో రైలు: సీటు దొరికితే అదృష్టమే! ప్రతి రైలుకు మూడే కార్లు, ఇవీ విశేషాలు..

దీనికితోడు మెట్రో తుది మెరుగులు దిద్దుకుంటుండడం, ఈ నెల 28న సాక్షాత్తు ప్రధాని మోడీ వచ్చి ప్రారంభిస్తారనే వార్తల నేపథ్యంలో ఎప్పుడెప్పుడు మెట్రో ఎక్కుదామాని నగర ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు.

ముఖ్యంగా మెట్రో స్టేషన్ల లోపల ఎలా ఉంటుంది, స్టేషన్లలో ఏమేం ఉంటాయో అనేది నగర వాసుల ఉబలాటం. ఎందుకంటే, భాగ్యనగర వాసుల దృష్టిలో మెట్రో ఒక అత్యంత వేగమైన ప్రయాణ సాధనమేకాదు, ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్ కూడా.

వేగమే కాదు.. సౌకర్యవంతం కూడా...

వేగమే కాదు.. సౌకర్యవంతం కూడా...

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణం వేగవంతమైనదే కాదు.. అత్యంత సౌకర్యవంతమైనది కూడా. సకుటుంబ సపరివారంతో క్షేమంగా వెళ్లి లాభంగా వచ్చే ప్రయాణం ఇది. ఈ మెట్రోరైల్ స్టేషన్లు సరికొత్త వసతులు, సౌకర్యాలతో అన్ని వర్గాల వారిని అలరించబోతున్నాయి. స్టేషన్‌లో దిగడమే ఆలస్యం కోరుకున్న వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఆయా వస్తువుల కొనుగోలు కోసం ట్రాఫిక్ రద్దీలో రోడ్లు దాటాల్సిన అవసరం ఉండదు. మెట్రోలో ప్రయాణించి కావలసినవి కొనుగోలు చేసుకోవచ్చు.

సమయం, డబ్బు.. రెండూ ఆదా...

సమయం, డబ్బు.. రెండూ ఆదా...

వంటింటి అవసరాలైన కూరగాయల నుంచి.. ఆటపాటలు కోరుకునే పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఆయా మెట్రో స్టేషన్లలో ఉండబోతున్నాయి. మెట్రో స్టేషన్లలో ప్రత్యేకంగా గేమింగ్ జోన్లు, మహిళల కోసం షాపింగ్ సెంటర్స్ తదితర సదుపాయాలతో మెట్రో సేవలు భళా అనిపించబోతున్నాయి. మెట్రోలో ప్రయాణం వల్ల సమయమే కాదు.. డబ్బు కూడా ఆదా అవనుంది.. పైగా ప్రయాణం భద్రం కూడా! ఇన్ని సౌకర్యాలుండబట్టే హైదరాబాద్‌లో మెట్రోరైలు ప్రారంభం కోసం నగరవాసులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

విలేజ్ స్టేషన్‌... మియాపూర్!

విలేజ్ స్టేషన్‌... మియాపూర్!

కాంక్రీట్ జంగిల్‌ గా మారిన భాగ్యనగరంలో పల్లె వాతావరణాన్ని సృష్టించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ తగిన ఏర్పాట్లు చేస్తోంది. మియాపూర్ స్టేషన్‌ను విలేజ్‌స్టేషన్ థీమ్‌తో అభివృద్ధి చేయనున్నారు. పూర్తిగా గ్రామీణ వాతావరణం కనిపించేలా ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నారు. ఇక్కడ హైదరాబాద్ మెట్రో రైల్‌కు మొత్తం ఎకరం స్థలం అందుబాటులో ఉంది. ఈ స్థలంలో నిర్మించిన కిలోమీటర్ మేర రహదారిని రాహ్‌గిరి జరుపుకోవడానికి, మరో 250 మీటర్ల రహదారిని విలేజ్‌థీమ్‌తో అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతానికి ఫెన్సింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, మరో వారంరోజుల్లో రాహగిరి, విలేజ్ థీమ్‌ను పూర్తిగా అభివృద్ధి చేయనున్నారు. దీంతోపాటు ఇక్కడ హాకర్‌ జోన్, రిలాక్సేషన్‌ జోన్, ఫుడ్‌కోర్ట్‌లు, రూరల్‌స్పాట్‌ జోన్‌లను ఏర్పాటు చేయనున్నారు.

వెజిటెబుల్ స్టేషన్‌గా భరత్‌నగర్..

వెజిటెబుల్ స్టేషన్‌గా భరత్‌నగర్..

భరత్‌నగర్ స్టేషన్‌లో వెజిటెబుల్ థీమ్‌తో మెట్రో రైతుబజార్‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఈ స్టేషన్ లో దిగి.. ఇంటికి కావాల్సిన కూరగాయలు కొనుక్కుని వెళ్లొచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలతో. అత్యాధునికంగా ఇక్కడ మెట్రో రైతు బజార్‌ను హెచ్‌ఎంఆర్ వర్గాలు నిర్మించారు. 140 మీటర్ల పరిధి గల స్టేషన్ కింది భాగంలో మూడు మార్కెట్లను ఏర్పాటు చేయబోతున్నారు. రైతుల కోసం రిటైల్ మార్కెట్, వ్యాపారుల కోసం హోల్‌సేల్ మార్కెట్, పార్సిల్ వెజిటెబుల్ మార్కెట్‌లను ఏర్పాటు చేయబోతున్నారు.

రైతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు...

రైతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు...

భరత్‌నగర్ స్టేషన్‌లో దాదాపు 150 మంది రైతులు, వ్యాపారులు, అమ్మకందారుల కోసం ప్రత్యేకమైన మార్కెట్లు నిర్మిస్తున్నారు. రిటైల్ మార్కెట్ కోసం రెండు ఫీట్ల ఎత్తులో ర్యాంప్‌ను, హోల్‌సేల్ మార్కెట్, పార్సిల్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా కియోస్క్ షట్టర్లను నిర్మిస్తున్నారు. మొత్తం 60 కియోస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. రైతులు, వ్యాపారులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఇక్కడే ఏసీ డార్మెటరీ గదులను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ 40 మంది రైతులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా గదిని నిర్మిస్తున్నారు. రైతులు అమ్మకాలు సాగించడం కోసం అర్ధరాత్రి వరకు మార్కెట్లోనే గడపాల్సి రావడంతో వారి సౌకర్యార్థం ఈ ఏర్పాట్లు చేయబోతున్నారు.

అన్ని స్టేషన్లలో ఫుడ్‌జోన్లు..

అన్ని స్టేషన్లలో ఫుడ్‌జోన్లు..

మియాపూర్ నుంచి నాగోల్ వరకు ఉండే అన్ని మెట్రో స్టేషన్లలో ఫుడ్‌జోన్లను ఏర్పాటు చేశారు. ప్రతీ స్టేషన్ మొదటి అంతస్తులోని కాన్‌కోర్స్‌లెవల్లో వీటిని రూపొందించారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయా స్టేషన్లలో ఈ ఫుడ్‌జోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ తినుబండారాలు, స్నాక్స్, కూల్‌డ్రింక్స్ అమ్మకాల కోసం అవసరమైన కియోస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

చిల్డ్రన్ స్టేషన్‌గా నాగోల్...

చిల్డ్రన్ స్టేషన్‌గా నాగోల్...

పిల్లలు ఆటలాడుకోవడానికి వీలుగా మెట్రోలో చిల్డ్రన్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి నాగోల్ స్టేషన్‌ను చిల్డ్రన్స్ స్టేషన్ థీమ్‌తో అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ హెచ్‌ఎంఆర్‌కు రెండెకరాల స్థలముంది. ఈ స్థలంలోనే పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి మెట్రో రైల్ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. పిల్లల మానసిక, శారీరక వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని చిల్డ్రన్ స్టేషన్‌లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఎలా ఆడలాడుకుంటారో.. దానిని మించి ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. దీని కోసం నాగోల్ స్టేషన్‌లో చెట్లు, కాల్వలు, నీటి కొలనులు, సైకిల్ ట్రాక్‌లు, గ్రీనరీని అభివృద్ధి చేయనున్నారు.

10 ఎకరాల్లో పబ్లిక్‌స్పేస్...

10 ఎకరాల్లో పబ్లిక్‌స్పేస్...

మియాపూర్‌లో మెట్రో రైల్ ను ప్రధాని మోడీ ప్రారంభిస్తుండటంతో ప్రతిష్టాత్మంగా తీసుకుని ఇక్కడ పబ్లిక్‌ స్పేస్‌ను భారీగా అభివృద్ధి చేస్తున్నారు. మియాపూర్‌లో 10 ఎకరాలను పబ్లిక్‌స్పేస్ కోసమే వినియోగిస్తున్నారు. ఇక్కడ కళాకారుల కోసం ఆర్డ్‌ స్పాట్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. పబ్లిక్ ఎవరైనా సరే ఇక్కడి ఆర్ట్ స్పాట్ లో తమ సృజనాత్మకతను ప్రదర్శించుకోవచ్చు. పెయింటింగ్, డ్రాయింగ్, ఆటలాడుకోవడం, పాటలు పాటుకోవడం, యోగా చేసుకోవడంతో పాటు వీధినాటకాలను ప్రదర్శించుకోవచ్చు.

English summary
The people of the Hyderabad is eagarly waiting for the opening ceremony of Metro Rail. As it was fixed earlier that on November 28th, Prime Minister Narendra Modi is coming to Hyderabad to open this Metro, City people also awaiting for the same. On the other hand officials of the HMR is completing the construction of the stations 100 percent and every metro station is it's unique features.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X