వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఐఎస్‌సిలో ప్రవేగా ఫెస్ట్ 2014 ఈవెంట్స్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని ప్రసిద్ధ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సి) భారీ సైన్స్, కల్చరల్ ఫెస్టివల్‌ను ‘ప్రవేగా (Pravega) 2014' పేరిట నిర్వహిస్తోంది. ప్రకృతి పరావర్తనాల వేగవంతంపై దృష్టి సారించి అభ్యసించడం వలన, ఈ ప్రవేగ ఫెస్టివల్ దేశ వ్యాప్తంగా పేరుపొందింది. ఈ ఫెస్ట్‌ను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ప్రవేగా ఫెస్టివల్‌లో ఏ రంగంలోనైనా ప్రతిభగల వ్యక్తులు పాల్గొనవచ్చని, ప్రత్యేక ఆకర్షణగా ఫెస్ట్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. విజ్ఞానం, సృజనాత్మకతకు ఈ ఫెస్ట్ మంచి వేదిక కానుందని పేర్కొన్నారు. సైన్స్ హద్దులను అన్వేషించడం వంటి పరిధి దాటిన అంశాలతో డిమాన్ స్ట్రేషన్, పోటీలు, కార్ఖానాలు, ప్రదర్శనలు, మూడు రోజులపాటు పరిశీలనాత్మకమైన చర్చలు కొనసాగుతాయని తెలిపారు.

సాంస్కృతిక పరిశీలనాత్మక వాతావరణం, శాస్త్రీయ వాతావరణం ప్రోత్సహించడానికి ఈ ఫెస్ట్ తోడ్పడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతి వాస్తవిక అంశాలపై జ్ఞానం, సృజనాత్మక కోరుకునే వారికి ప్రోత్సాహకరంగా ఈ పెస్ట్ ఉంటుందని తెలిపారు. ఔత్సాహికులు తమ నైపుణ్యాలను ప్రధర్శించుకునేందుకు మంచి అవకాశంగా ఫెస్ట్ ఉండనుందని పేర్కొన్నారు. ఫెస్ట్ వివరాల కోసం http://www.pravega.org సంప్రదించవచ్చు.

రాక్ బ్యాండ్

రాక్ బ్యాండ్

బెంగళూరుకు చెందిన ప్రముఖ హిందీ ర్యాక్ బాండ్ ప్రవేగా ఫెస్ట్‌లో తన ప్రదర్శనను ఇవ్వనుంది. భారతీయ సంగీతంతోపాటు ప్రకృతి అభివర్ణిస్తూ వారు చేసే సంగీత విన్యాసం ఆకట్టుకునేలా ఉండనుంది. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 1న రాత్రి 7.30 గంటలకు నిర్వహించనున్నారు.

మల్టి డిసిప్లనరీ కార్యక్రమాలు

మల్టి డిసిప్లనరీ కార్యక్రమాలు

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని ప్రసిద్ధ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సి) భారీ సైన్స్, కల్చరల్ ఫెస్టివల్‌ను ‘ప్రవేగా (Pravega) 2014' పేరిట నిర్వహిస్తోంది. ఈ ఫెస్ట్‌లో ట్రాన్స్ పోర్ట్ సిస్టం, ఎనర్జీ గ్రిడ్ డిజైన్ అర్కిటెక్చర్ పంపిణీలపై ప్రదర్శనలు జరగనున్నాయి.

సైన్స్ స్లామ్

సైన్స్ స్లామ్

ప్రవేగా ఫెస్ట్‌లో 3 నిమిషాల వ్యవధిలో ఔత్సాహికులు తమకున్న నైపుణ్యాల(పాటలు, డాన్స్, డ్రామా, పొయిట్రీ)ను ప్రదర్శించవచ్చు. ఫిబ్రవరి 1 ఉదయం 11గంటలకు ఈ ప్రదర్శనలు జరగనున్నాయి.

క్విజింగ్ ఈవెంట్

క్విజింగ్ ఈవెంట్

ఐడిబిఐ బ్యాంకు ఆధ్వర్యంలో జెఎన్ టాటా ఆడిటోరియంలో ఫిబ్రవరి 2 ఉదయం 9గంటలకు ప్రవేగాలో భారీ క్విజింగ్ ఈవెంట్‌ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో విజేతగా నిలిచి రూ. 25వేల నగదును కూడా గెలుచుకునే అవకాశం ఉంది.

సైన్స్ క్విజైన్

సైన్స్ క్విజైన్

జెఎన్ టాటా ఆడిటోరియంలో ఫిబ్రవరి 1న ప్రవేగా మెగా సైన్స్ క్విజ్ ఈవెంట్‌ను నిర్వహించడం జరుగుతుంది. విజేతగా నిలిచిన వారికి రూ. 15 వేలు అందజేయడం జరుగుతుంది.

ఫిజిక్స్ టెస్ట్

ఫిజిక్స్ టెస్ట్

భౌతిక శాస్త్రంపై అవగాహన, ఫండమెంటల్స్‌పై టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో విజేతకు రూ. 10 వేలు ప్రైజ్ మనీ అందించనున్నారు.

ఐడియాస్ ప్రజెంటేషన్

ఐడియాస్ ప్రజెంటేషన్

అన్ని ఇంజినీరింగ్ స్ట్రీమ్స్‌పై తమకున్న ఐడియాలను పేపర్‌పై వివరించేందుకు ప్రవేగా విద్యార్థులను ఆహ్వానించింది.

పిక్సెల్ పండిట్

పిక్సెల్ పండిట్

కార్ల్ జీస్ భాగస్వామ్యంతో ప్రవేగాలో చిత్ర ప్రాసెసింగ్‌పై కూడా పోటీలను నిర్వహించడం జరుగుతుంది. చిత్ర ప్రాసెసింగ్ అనేది కష్టంతో కూడిన ఉద్యోగం కాబట్టి, అందులో రాణించాలంటే అల్గరిథమ్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఇది కంప్యూటర్స్ సైన్స్ పరిశోధనలో ఎంతో ముఖ్యం.

ఫొటోగ్రాఫి కాంటెస్ట్

ఫొటోగ్రాఫి కాంటెస్ట్

అత్యంత ఆకట్టుకునే ఫొటోగ్రఫీలతో ప్రవేగాలో నిర్వహించే పోటీల్లో పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొన్న విజేతలకు రూ. 10 వేల బహుమతి అందజేయనున్నారు.

ఎస్సే కాంపిటీషన్

ఎస్సే కాంపిటీషన్

ప్రవేగాలో ఏవైనా ఆరు అంశాలను ఎంచుకుని వాటిపై వ్యాసాలను రాయాల్సి ఉంటుంది. ఈ వ్యాసరచన పోటీల్లో గెలిచిన వారికి రూ. 10 వేల బహుమతి అందజేయనున్నారు.

లాస్య డాన్స్ కాంపిటీషన్

లాస్య డాన్స్ కాంపిటీషన్

ప్రవేగాలో మెగా డాన్స్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. కొత్తగా రూపొందించిన నృత్యాలతో ఆకట్టుకుని విజేతగా నిలిచిన వారికి భారీ మొత్తం రూ. 45 వేల రూపాయలను బహుమతిగా అందజేయనున్నారు.

కెమిస్ట్ టెస్ట్

కెమిస్ట్ టెస్ట్

ప్రవేగాలో రసాయన శాస్త్రంపై టెస్ట్‌ను నిర్వహించనున్నారు. రసాయన శాస్త్రంపై అవగాహన, నూతన ఆవిష్కరణలు లాంటివి వివరించేందుకు ప్రవేగా వేదికగా నిలవనుంది. ప్రపంచంలో రసాయన శాస్త్రంపై జరిగిన పరిశోధనలపై వివరించే అవకాశం కూడా ఉంది. ఇందులో విజేతగా నిలిచిన వారికి 12 వేల రూపాయలను అందజేయనున్నారు.

English summary
Towering at the metropolitan city of Bangalore, IISc conducts one of the biggest programmes in the country - Pravega 2014!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X