పాకిస్తాన్‌తో సరిహద్దు మూసివేత: భారత్ కీలక నిర్ణయం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను వీలైనంత త్వరగా మూసివేసేందుకు భారత్‌ చర్యలు చేపడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

2 వేలమంది ఉగ్రవాదులు: బంగ్లాదేశ్ నివేదిక, భారత్‌లో కలకలం!

ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు భారత్‌ తీసుకోబోయే అతిపెద్ద నిర్ణయం ఇదేనని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని తేకన్‌పూర్‌ సరిహద్దు బీఎస్‌ఎఫ్‌ అకాడమీలో జరిగిన పాసింగవుట్‌ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు.

ఆయనకు బీఎస్‌ఎఫ్‌ బలగాలు గౌరవవందనం సమర్పించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదంతో భారత్‌ ఒక్కటే ఇబ్బందులు ఎదుర్కొవడం లేదన్నారు.

వచ్చే ఏడాది మూసివేస్తాం

వచ్చే ఏడాది మూసివేస్తాం

వచ్చే ఏడాది కల్లా పాక్‌తో సరిహద్దును మూసివేసే అవకాశముందని తెలిపారు. చొరబాటు యత్నాలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టును కేంద్ర హోంశాఖ కార్యదర్శి, బీఎస్‌ఎఫ్‌, సంబంధిత రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని చెప్పారు.

సరిహద్దు మూసివేత

సరిహద్దు మూసివేత

భౌగోళికంగా సంక్లిష్టమైన ప్రాంతాల్లో సరిహద్దును సీల్‌ చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగస్తామని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది పోషిస్తున్న పాత్రను ఆయన కొనియాడారు.

మన జవాన్ల గురించి తెలుసు

మన జవాన్ల గురించి తెలుసు

పొరుగు దేశాల్లో ఈ దళం గురించి బాగా తెలుసని చెప్పారు. భద్రతా దళ సిబ్బంది సమస్యలను సమర్థంగా పరిష్కరించేందుకు త్వరలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అస్సాంలో వేర్పాటువాదులతో పోరాడుతూ కంటి చూపును కోల్పోయిన బీఎస్‌ఎఫ్‌ సహాయ కమాండెంట్‌ సందీప్‌ మిశ్ర ఇంటికి రాజ్‌నాథ్‌ వెళ్లారు. ఆ కుటుంబం విజ్ఞప్తి మేరకు వారితో కలసి భోజనం చేశారు.

పొరుగు దేశాలపై ప్రభావం

పొరుగు దేశాలపై ప్రభావం

కాగా, పొరుగు దేశాలపై వాటి ప్రభావం పడుతోందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి గోపాల్‌ భగ్లే వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union home minister Rajnath Singh on Saturday said India plans to seal international boundaries+ with neighbouring countries Pakistan and Bangladesh soon.
Please Wait while comments are loading...