వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ టార్గెట్ ఎన్నికలా, రాష్ట్ర సాధనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధనా, 2014 ఎన్నికలా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టే ఉద్యమాలపై ఎప్పటికప్పుడు గడువులు ప్రకటిస్తూ వాయిదాలు వేస్తూ వస్తున్నారు. కాంగ్రెసు అధిష్టానం మనోగతం మేరకే తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కార్యాచరణ ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాకుండా 2014లో వచ్చే లోకసభ, శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు బలపడకుండా చూడడం వరకే ఆయన పరిమితమవుతున్నారని అంటున్నారు.

కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఇస్తున్న కార్యాచరణకే కెసిఆర్ చెప్పాపెట్టకుండా కట్టుబడి పనిచేస్తున్నారు. తెలంగాణ అంశంపై రెండు రోజుల పాటు లోకసభను స్తంభింపజేసిన కెసిఆర్ ఆ తర్వాత కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులకు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన హితబోధతో వెనక్కి తగ్గారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూడాలని కాంగ్రెసు అధిష్టానం చేసిన సూచనకే ఆయన కట్టుబడి పనిచేస్తున్నారని చెప్పక తప్పదు. జూన్‌లోగా తమ పార్టీ అధిష్టానం తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే తామేమిటో చూపిస్తామని తెలంగాణ పార్లమెంటు సభ్యులు చెప్పారు. వారి కార్యక్రమానికే కెసిఆర్ కూడా కట్టుబడినట్లు కనిపిస్తున్నారు.

ప్రస్తుతం కెసిఆర్ తన నమస్తే తెలంగాణ పత్రికను బయటకు తేవడంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. నమస్తే తెలంగాణ పత్రికలోని జర్నలిస్టులకు ఆయనే క్లాసులు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆయన పత్రిక తీరుతెన్నులపై వారికి పాఠాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన నమస్తే తెలంగాణ ఆవిష్కరణ జరుగుతుందని అంటున్నారు. కానీ, అధికారికంగా ఎటువంటి ప్రకటన కూడా వెలువడలేదు. వచ్చే ఎన్నికల నాటికి పత్రిక, చానెల్ దుమ్ము రేపుతూ తనకు అండగా ఉంటాయని కెసిఆర్ అనుకుంటున్నారు. ఈలోగా వస్తే, గిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ పార్లమెంటు, శాసనసభ స్థానాలను గెలుచుకుని కాంగ్రెసు అధిష్టానం మెడలు వంచాలనే లక్ష్యమే తప్ప మరో లక్ష్యం లేదని చెబుతున్నారు.

English summary
It seems TRS president K chandrasekhar rao is not in a mood take up agitation to achieve Telangana state immediately. It is said that he is preparing for 2014 election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X