పొలిటికల్ ఎంట్రీ పక్కా, భవిష్యత్తులో సీఎం: రజనీపై జ్యోతిష్కుల అంచనా!..

Subscribe to Oneindia Telugu

చెన్నై: సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై జరుగుతున్న చర్చ ఈనాటిది కాదు. అందుకోసం జరుగుతున్న ప్రయత్నాలు కూడా ఈనాటివి కావు. ఏళ్లుగా ఈ చర్చ కొనసాగుతుందే తప్పితే.. రజనీ మాత్రం రాజకీయాల పట్ల తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

''రజనీ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది'', కానీ, '' 21 ఏళ్ళ క్రితమే తప్పు చేశా ''

ప్రస్తుత తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితిని రూపుమాపడానికి రజనీయే సరైన వ్యక్తి అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. తరుచుగా పోస్టర్ల ద్వారా తమ ఆకాంక్షను వెలిబుచ్చుతూనే ఉన్నారు. ఇటీవల అభిమానులతో రజనీ సమావేశమవుతున్నారనగానే.. రాజకీయ ఎంట్రీ గురించే అనుకున్నారు. కానీ యథావిధిగా రజనీ ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు.

predictors saying rajani political entry confirm soon

ఇదిలా ఉంటే, అక్కడి జ్యోతిష్కులు మాత్రం రజనీని ఎలాగైనా సరే, రాజకీయాల్లోకి దించాలని భావిస్తున్నారు. ఆయనకు రాజయోగం ఉందని, రాష్ట్రానికి సీఎంగా కూడా పని చేయనున్నారని భవిష్యత్తును అంచనా వేస్తున్నారు. ఇక మూడో రోజు అభిమానులతో సమావేశంలో భాగంగా.. ఓ కొత్త విషయంపై చర్చ జరుగుతోంది.

వేదిక వెనుక ఉంచిన పోస్టరులో ఓ కమలంపై 'బాబా ముద్ర' లోగోగా కనిపిస్తుండటంతో .. బీజేపీకి దగ్గరవుతున్నారా? అంటూ లేని అనుమానాలను తెర మీదకు తెస్తున్నారు. కాగా, తొలి రోజు సమావేశంలో.. ప్రస్తుతానికి నటుడినని, భవిష్యత్తులో దేవుడు ఆదేశిస్తే ఏమైనా జరగవచ్చని రజనీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రెండో రోజున తాను రాజకీయాల్లోకి వస్తే, అవినీతి పరులను దగ్గర చేర్చబోనని కూడా చెప్పుకొచ్చారు.

రాజకీయాలపై రజనీకి ఆసక్తి లేదనే విషయం స్పష్టంగానే కనిపిస్తున్నా.. అభిమానులు మాత్రం అందుకోసం తపిస్తూనే ఉన్నారు. వారు అలా కోరుకోవడంలో తప్పేమి లేదని స్వయంగా రజనీయే చెప్పారు. చూడాలి మరి.. ఈ జ్యోతిష్కుల జోస్యం ఎంతవరకు రజనీ మనసు మార్చుతుందో?

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamilnadu predictors saying Super star Rajinikanth will come into direct politics in soon. At present Rajani conducting meetings with his fans
Please Wait while comments are loading...