తెలుగు సినిమాల్లో ముద్దు సీన్లపై నిర్మాత డి. సురేష్ బాబు వేసిన ప్రశ్నకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిపికేషన్ ప్రాంతీయాధికారి ధనలక్ష్మికి దిమ్మ తిరిగింది. గిన్నీస్ రికార్డులకు ఎక్కిన దగ్గుబాటి రామానాయుడు కుమారుడు సురష్ బాబు వేసిన ప్రశ్నలో అర్థాలు చాలానే ఉన్నాయి. ఆ ప్రశ్న అర్థమైనప్పటికీ ఏం చెప్పాలో ఆ అధికారికి అర్థం కాలేదు. హిందీ, ఇంగ్లీషు సినిమాల్లో లిప్ టు లిప్ కిస్‌ను అనుమతించినప్పుడు తెలుగు సినిమాల్లో ఉంటే అర్థమేమిటనేది సురేష్ బాబు ఆంతర్యం కావచ్చు. ఏ చెప్పాలో తెలియక దేశవ్యాప్తంగా పాటించడానికి ఒకే విధానాన్ని రూపొందిస్తామని ఆ అధికారి జవాబిచ్చి తప్పించుకున్నారు.
తెలుగు నిర్మాతలు, దర్శకులు సెన్సార్ బోర్డు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నట్టి కుమార్, తేజ వంటివారు కూడా టెలివిజన్ సీరియళ్లకు సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేనప్పుడు సినిమాలకే ఎందుకని అడుగుతున్నారు. సెక్స్ సినిమాలకు, హారర్ సినిమాలకు కలిపి ఎ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు, ఏ సినిమా కంటెంట్ ఏమిటో ప్రేక్షకులకు ఎలా తెలుస్తుందని తేజ అడిగాడు.
"How do you define a lip-to-lip kiss?" Producer D Suresh Babu could not help but pose this question point-blank to the regional officer of the Central Board of Film Certification (CBFC), A Dhanalaxmi, here on Wednesday.
Story first published: Thursday, July 14, 2011, 9:59 [IST]