వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూరిని చంపి సినిమా చూసిన భాను

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన పారిపోయిన భాను కిరణ్ ఆ తర్వాత ఏం చేశాడనేది సర్వత్రా ఆసక్తికరంగానే ఉంది. సూరిని చంపిన మర్నాడు, అంటే 2011 జనవరి 4వ తేదీన అతను ముంబైలో సినిమా చూశాడట. ముంబైలోని సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ థియేటర్‌లో అతను తీస్ మార్ ఖాన్ సినిమా చూశాడని అంటున్నారు. ఈ విషయాన్ని భాను సిఐడి అధికారుల విచారణలో చెప్పాడు.

తన అనుచరుడు మన్మోహన్ సింగ్‌తో కలిసి అతను ఆ సినిమా చూశాడట. సూరి, రామ్ గోపాల్ వర్మ సూచన మేరకు భాను కిరణ్ 2010 డిసెంబర్‌లో సి. కళ్యాణ్, సింగనమల రమేష్‌లకు చెందిన బాలాజీ కలర్ ల్యాబ్‌ నుంచి రక్తచరిత్ర - 2 రీళ్లను బెంగళూర్‌ తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నారు. బెంగళూర్‌లోని ఫోరం మాల్‌లో, మేక్రీలోని మరో థియేటర్‌లో ప్రివ్యూ షో కోసం వాటిని భాను తీసుకుని వెళ్లినట్లు సిఐడి విచారణలో తేలిందని చెబుతున్నారు.

ఆ స్థితిలోనే భాను కిరణ్‌తో లింక్స్ గురించి సిఐడి అధికారులు రామ్ గోపాల్ వర్మను ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముంబైలో తన ఫోటోతో ప్రచురితమైన వార్తను తెలుగు వార్తాపత్రికల్లో చదవడానికి భాను కిరణ్ ప్రయత్నించాడని కూడా తెలుస్తోంది.

సూరి మృతదేహం ఫోటో, ఆ పక్కనే తన ఫొటో చూసి వెంటనే తాను రేజర్ కొనుక్కుని సులభ్ కాంప్లెక్స్‌కు వెళ్లానని, బాత్రూంలో మీసాలు తొలగించుకున్నానని భాను కిరణ్ సిఐడి అధికారులకు చెప్పాడు. హైదరాబాదులో తాను పెద్ద వ్యక్తిని చంపానని, ఆ విషయం పోలీసులు తనను అరెస్టు చేస్తే చంపేస్తారని తాను మన్మోహన్ సింగ్‌కు చెప్పినట్లు అతను తెలిపాడు. ఏమైనా, భాను కిరణ్ వ్యవహారాలు కథలు కథలుగా ముందుకు వస్తూనే ఉన్నాయి.

English summary
Gangster Bhanu Kiran watched the movie Tees Mar Khan at a theatre near Central Railway station in Mumbai on January 4, 2011 a day after killing Maddelacheruvu Suri in Hyderabad. Bhanu told the CID in his confession that he watched the movie along with his associate Manmohan Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X