అక్రమ సంబంధం వల్లే బిజినెట్ టైకూన్ హత్య?

దీపక్ భరద్వాజ్ చిన్న కుమారుడు నితేష్, అతని తల్లి రమేష్ కుమారి, న్యాయవాది బలజీత్ స్వామీజీగా చెప్పుకునే స్వామి ప్రతిభాదనంద్‌ను కలిశారు. హత్యకు కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ మహిళతో ఉన్న వైవాహికేతర సంబంధమే అందుకు కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
ఆ మహిళను భరద్వాజ్ వివాహం చేసుకుంటాడని, దానివల్ల ఆయన అస్తి అంతా ఆమెకే చెందుతుందని భయపడి కుటుంబ సభ్యులు ఆయన హత్యకు పూనుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. భరద్వాజ్ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే నితేష్‌ను, బలజీత్‌ను అరెస్టు చేశారు. భరద్వాజ్ హత్యకు తాము కుట్ర చేశామని వారిద్దరు అంగీకరించినట్లు చెబుతున్నారు.
భరద్వాజ్ హత్యకు బలజీత్ ఐదు కోట్ల రూపాయలు అడిగినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు డబ్బులు కావాలనే ఉద్దేశంతో అందుకు బలజీత్ అంగీకరించడాని, ఆ మొత్తాన్ని ఇవ్వడానికి నితేష్ అంగీకరించాడని పోలీసులు భావిస్తున్నారు. నితేష్ 50 లక్షల రూపాయలు ఇచ్చాడని, అందులో పది లక్షల రూీపాయలు ప్రతిభానంద్‌కు ఇచ్చాడని, దాంతో అతను ఇద్దరు కాంట్రాక్టు కిల్లర్లను ఏర్పాటు చేశాడని అంటున్నారు.
ప్రతిభానంద్ పరారీలో ఉన్నాడు. కారు, గన్స్ కొనుగోలుకు ప్రతిభానంద్ కాంట్రాక్ట్ కిల్లర్లకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. కాంట్రాక్టు కిల్లర్స్ పురుషోత్తమ్ రాణాను, సునీల్ మన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications