బాబు జోక్స్ మామూలుగా లేవు!: అవాక్కయిన ఎమ్మెల్యేలు.. వినాయకుడిలా అంటూ!

Subscribe to Oneindia Telugu
  బాబు జోక్స్ కి అవాక్కయిన ఎమ్మెల్యేలు Chandrababu Making Fun With MLAs | Oneindia Telugu

  విజయవాడ: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు.

  అయితే నేతల అలసత్వ వైఖరితో కొన్నిచోట్ల ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నత్తనడకన నడుస్తున్నట్టు సీఎం చంద్రబాబుకు రిపోర్టులు అందుతున్నాయి. దీంతో సదరు నేతలను పిలిపించుకుని మరీ వారికి ఆయన క్లాస్ పీకుతున్నారు.

   ప్రభుత్వ టెక్నాలజీ పనిచేయట్లేదా?:

  ప్రభుత్వ టెక్నాలజీ పనిచేయట్లేదా?:

  ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై బుధవారం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. తనకు అందిన రిపోర్టుల ఆధారంగా ఒక్కొక్కరిపై ఒక్కో తరహాలో జోకులు పేల్చారు. సున్నితంగా మందలిస్తూనే చురకలంటించే ప్రయత్నం చేశారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, గన్నవరం వంశీ తదితరులు తమ సొంత టెక్నాలజీని వాడుతున్నట్టు రిపోర్టుల్లో తేలడంతో.. ప్రభుత్వ టెక్నాలజీ పనిచేయడం లేదా? అంటూ వారిని ఛమత్కరించారు.

   ఆ ఎమ్మెల్యేపై జోక్స్:

  ఆ ఎమ్మెల్యేపై జోక్స్:

  తెనాలి ఎమ్మెల్యే గురించి ప్రస్తావిస్తూ.. ఆయనెక్కడున్నారని ప్రశ్నించారు చంద్రబాబు. ఢిల్లీ వెళ్లారన్న సమాధానం రావడంతో.. 'అయితే అడిగానని చెప్పండి, క్షేమ సమాచారాలు అడగండి' అంటూ పంచ్ విసిరారు.

  నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే రామారావుపై కూడా ఇదే తరహాలో జోక్స్ వేశారు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారని అధికారులు చెప్పడంతో.. 'ఇంటర్నెట్ ద్వారా ఆయనకు హలో చెప్పండి' అంటూ ఛమత్కరించారు.

   గుంటూరు ఎమ్మెల్యేపై ఇలా:

  గుంటూరు ఎమ్మెల్యేపై ఇలా:

  అన్నింటిలోకి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై వేసిన జోక్ బాగా పేలినట్టు తెలుస్తోంది. ఆయన గురించి మాట్లాడుతూ.. 'కుమారస్వామిలా కష్టపడి తిరగకుండా.. వినాయకుడిలా ఈశ్వరుడి చుట్టూ తిరిగితే సరిపోతుందనుకుంటున్నావా' అని ప్రశ్నించారు.

  బాబు ప్రశ్నతో కంగు తిన్న ఎమ్మెల్యే మోదుగుల అలాంటిదేమి లేదని బదులిచ్చారు. బయటి నియోజకవర్గాల్లో తిరుగుతున్నందునా తన సొంత నియోజకవర్గంలో కొంత ఆలస్యమైందని వివరణ ఇచ్చుకున్నారు.

   మీ ఫిట్‌నెస్ బాగుందని:

  మీ ఫిట్‌నెస్ బాగుందని:

  ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే డేవిడ్ రాజును ఉద్దేశించి.. మీ ఫిట్‌నెస్ బాగుందని కితాబిచ్చారు చంద్రబాబు. రోజుకు ఎన్ని కి.మీ తిరుగుతున్నారని బాబు ఆయన్ను ప్రశ్నించగా.. 10కి.మీ తిరుగుతున్నట్టు బదులిచ్చారు. స్పందించిన బాబు.. 'ఓ.. అయితే మీ ఫిట్ నెస్ బాగుంటుంది' అన్నారు.

  సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఆలోచనలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  AP CM Chandrababu Naidu conducted a review meeting over Intintiki Telugu Desam program.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి