చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు వేటు.. విదేశాలకు ధనంజయ జంప్? మరో శేఖర్ రెడ్డి అంటూ..

ఏర్పేడు ప్రమాద ఘటనపై అనుమానాలు, కుట్ర కోణాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏర్పేడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ధనంజయ నాయుడు, ఆయన సోదరుడు చిరంజీవి నాయుడును టిడిపి నుంచి సస్పెండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఏర్పేడు ప్రమాద ఘటనపై అనుమానాలు, కుట్ర కోణాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏర్పేడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ధనంజయ నాయుడు, ఆయన సోదరుడు చిరంజీవి నాయుడును టిడిపి నుంచి సస్పెండ్ చేశారు.

వారిని ఉరి తీయాలి, ఆ కలెక్టర్ ఓ ఫూల్: మోహన్ బాబు ఆగ్రహంవారిని ఉరి తీయాలి, ఆ కలెక్టర్ ఓ ఫూల్: మోహన్ బాబు ఆగ్రహం

ఇసుక అక్రమ రవాణా చేస్తూ అక్రమ సంపాదనతో రైతుల మనోభావాలు దెబ్బదతీసి, ఏర్పేడు వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆ ఇద్దరిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు టిడిపి అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరిట జిల్లా పార్టీ సోమవారం తెలిపింది.

వీరిద్దరిని టిడిపి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. అయితే, అంతలోనే ధనంజయులు విదేశాలకు పరారైనట్లుగా ప్రచారం సాగుతోంది. చిరంజీవి నాయుడు కూడా పరారీలో ఉన్నారని అంటున్నారు. గుణశేఖర్ అనే వ్యక్తి మాత్రం పోలీసులకు చిక్కాడు.

మరో శేఖర్ రెడ్డి అంటూ..

మరో శేఖర్ రెడ్డి అంటూ..

మరోవైపు, ధనంజయులుపై ప్రజాశక్తి పత్రిక ఓ కథనం రాసింది. 'మరో శేఖర్ రెడ్డి..'ధనంజయులు'' పేరుతో ఓ కథనం రాసింది. ఈ కథనంలో ఆయన ఆస్తులు రూ.200 కోట్ల మేర ఉన్నాయని, ఊళ్లో 54 ఏకరాలు కబ్జా చేశాడని, రోజుకు రూ.10 లక్షల ఇసుక వ్యాపారం చేసేవాడని పేర్కొంది.

450 ట్రాక్టర్లు, ఐదు లారీల ద్వారా చెన్నరు, బెంగుళూరుకు అక్రమంగా ఇసుక తరలిస్తూ ప్రతిరోజూ రూ.పది లక్షలకు పైగా ఆర్జిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అని పేర్కొంది. సొంతూళ్లోనే 54 ఎకరాలను కబ్జా చేసినట్లూ ఆయనపైనా, అనుచరులపైనా ఆరోపణలున్నాయని పేర్కొంది.

యాథృచ్చికం కాదు, కుట్రే!, ఎవరి పని?: చిత్తూరు ప్రమాదంపై అనుమానాలు(ఫోటోలు) యాథృచ్చికం కాదు, కుట్రే!, ఎవరి పని?: చిత్తూరు ప్రమాదంపై అనుమానాలు(ఫోటోలు)

ఏకఛత్రాధిపత్యంగా..

ఏకఛత్రాధిపత్యంగా..

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ధనంజయులునాయుడు ఏలుతున్నాడనే మాట వినిపిస్తోందని పేర్కొంది. రేషన్‌కార్డు కావాలన్నా, పింఛను తీసుకోవాలన్నా ధనంజయులునాయుడు కనుసన్నల్లోనే యంత్రాం గం ఇదివరకు నడిచేదని జనాలు చెప్పుకుంటారని పేర్కొంది.

చంద్రబాబు హెచ్చరికతో..

చంద్రబాబు హెచ్చరికతో..

ఏర్పేడు ఘటన దరిమిలా టిడిపి నుంచి ధనంజయులునాయుడు, చిరంజీవులు నాయుడులను సస్పెండ్‌ చేశారు. వారికి సహకరించిన అనుచరగణాన్ని కూడా వదిలేది లేదని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో వారు కేసు నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తున్నారని పేర్కొంది.

ధనంజయులు నాయుడు బెంగుళూరు, చెన్నరు విమానాశ్రయాల నుంచి విదేశాలకు పరారైనట్లు మండల కేంద్రంలో చర్చ నడుస్తోందని పేర్కొంది. ఘటనకు కారకులైన గోవిందపురం సర్పంచి చిరంజీవినాయుడు, రవినాయుడు కూడా పరారీలో ఉన్నారని, కోబాకకు చెందిన గాలి గుణశేఖర్ నాయుడును పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహశీల్దారును సస్పెండ్‌ చేశారు. ఎస్సై పైనా వేటు పడనుంది.

కోట్లకు పడగెత్తిన వైనం..

కోట్లకు పడగెత్తిన వైనం..

ఏర్పేడు మండలం నుండి 2004లో జెడ్పీటీసీగా గెలుపొందిన ధనంజయులు నాయుడు అప్పట్లో సాధారణ రైతు. ఏర్పేడు మండలం గోవిందవరం సొంతూరు. స్వర్ణముఖి నది వీరి గ్రామాల వైపు పారడంతో ఇసుక అక్రమ వ్యాపారం వైపు మొగ్గు చూపాడని చెబుతుంటారు. రోజుకు 450 ట్రాక్టర్లలో ఇసుకను మూడు ప్రాంతాల నుంచి తరలించేవారని తెలుస్తోందని పేర్కొంది.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu suspends Chiranjeevi Naidu from TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X