వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిమాండ్: జైలు నుంచి శశికళ ఎలా చక్రం తిప్పుతున్నారంటే..?

అన్నాడీఎంకే అధినేత్రి శశికళ అక్రమాస్తుల కేసుకు సంబంధించి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఆమె జైలు నుంచి తమిళనాడులో చక్రం తిప్పుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆమె జైలుకు వెళ్లకముందు.. ముఖ్యమం

|
Google Oneindia TeluguNews

చెన్నై/బెంగళూరు: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ అక్రమాస్తుల కేసుకు సంబంధించి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఆమె జైలు నుంచి తమిళనాడులో చక్రం తిప్పుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆమె జైలుకు వెళ్లకముందు.. ముఖ్యమంత్రి పదవి ఆశించారు. కానీ అది నెరవేరలేదు.

తన స్థానంలో పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేశారు. అలాగే పార్టీ నడిపే బాధ్యతలను దినకరన్‌కు అప్పగించారు. అయినప్పటికీ ఆమె జైలు నుంచి చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.

ముఖ్యమైన డిమాండ్

ముఖ్యమైన డిమాండ్

జైలు అధికారులు ఆమెను వివిఐపి ఖైదీగా గుర్తించేందుకు నిరాకరించారు. అటాచ్‌డ్ బాత్రూం, కాట్, ఇంటి నుంచి భోజనం వంటి వాటిని అధికారులు నిరాకరించారు. అయితే, జైలు అధికారుల ముందు మాత్రం ఆమె ముఖ్యమైన డిమాండ్ పెట్టినట్లుగా చెబుతున్నారు. అదే తన పార్టీ వారిని కలవడం. ఎప్పటికప్పుడు తాను పార్టీ వారిని కలిసేందుకు అవకాశమివ్వాలని కోరారని అంటున్నారు.

31 రోజుల్లో 19 మంది కలిసినట్లుగా..

31 రోజుల్లో 19 మంది కలిసినట్లుగా..

జైలు నిబంధనల ప్రకారం నెలకు ఇధ్దరు మాత్రమే ఆమెను చూడవచ్చు. అయితే, గత 31 రోజుల్లో ఆమెను 19 మంది కలిసినట్లుగా ఆర్టీఐ కార్యకర్త నరసింహ మూర్తి చెబుతున్నారు.

శశికళ భర్త నటరాజన్, లాయర్లు అప్పుడప్పుడు కలిసినట్లుగా చెబుతున్నారు. తంబీదురై, దినకరన్, ఎమ్మెల్యేలు వలరమతి, గోకుల ఇందిరా, సీఆర్ సరస్వతి వంటి వారు తరుచూ కలిసేవారిలో ఉన్నారని చెబుతున్నారు. మన్నార్ గుడి నుంచి గూడా పలువురు కలుస్తున్నారని చెబుతున్నారు. ఈ కలయిక ద్వారా రాజకీయ అంశాలు చర్చకు రావడం, ఆమె జైలు నుంచే చక్రం తిప్పడం జరుగుతోందంటున్నారు.

జైలు అధికారుల విచక్షణ

జైలు అధికారుల విచక్షణ

ఆర్టీఐ కార్యకర్త మూర్తి వెల్లడించిన వివరాలపై జైలు అధికారులు కూడా స్పందించారు. జైలులో ఉన్న వారు వారానికి ఓసారి కలవవచ్చునని చెప్పారు. డీజీపీ మాట్లాడుతూ.. నియమాలు ఉన్నాయని, అయితే కొన్ని జైలు అధికారుల విచక్షణతోను ఇలాంటి అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి శశికళను నేతలు తరుచూ కలుస్తున్నట్లుగా తెలుస్తోందంటున్నారు.

బెంగళూరు నగరానికి

బెంగళూరు నగరానికి

బెంగళూరు నగరానికి చెందిన సామాజిక కార్యకర్త టి. నరసింహమూర్తి ఆర్టీఐ చట్టం కింద తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసును సుప్రీం కోర్టులో వాదించడానికి కర్ణాటక ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టింది అనే పూర్తి వివరాలు ఇవ్వాలని అర్జీ సమర్పించారు. జయ ఆస్తుల కేసు వాదించేందుకు కర్నాటక ప్రభుత్వానికి రూ.2.79 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా వెల్లడయింది.

English summary
Sasikala Natarajan who was once upon a time the chief minister in waiting is currently in jail after being convicted for corruption in the famous disproportionate assets case. The jail authorities say that most of her demands such as an attached bathroom, cot and home cooked food had been denied.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X