విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: అవినీతి అనకొండలకు ఆ ఇద్దరు మంత్రుల అండ!(పిక్చర్స్)

రెండ్రోజుల క్రితం రూ.500కోట్ల మేర అక్రమాస్తులతో ఏసీబీకి చిక్కిన గొల్ల వెంకట రఘు వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రెండ్రోజుల క్రితం రూ.500కోట్ల మేర అక్రమాస్తులతో ఏసీబీకి చిక్కిన పట్టణ ప్రణాళికా విభాగం (టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌) డైరెక్టరు గొల్ల వెంకట రఘు వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రఘుకు కీలక బాధ్యతలు అప్పగించడం కోసం ఇద్దరు మంత్రులు చొరవ తీసుకున్నారని తెలిసింది.

ముగ్గురు కలిసి..

ముగ్గురు కలిసి..

పట్టణ ప్రణాళికా విభాగం (టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌) డైరెక్టరు గొల్ల వెంకట రఘు అవినీతి అక్రమాలలో పురపాలక శాఖ ఇంజినీరింగ్‌ విభాగం జూనియర్‌ టెక్నికల్‌ అధికారి నల్లూరి వెంకట శివప్రసాద్‌, ఇతని భార్య చింతమనేని గాయత్రిలు కూడా భాగస్వాములైన విషయం తెలిసిందే. వీరు ఒకరికొకరు బినామీలుగా ఉంటూ రూ.500కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టారు. ఏసీబీ అధికారులు వీరిని కటకటాల వెనక్కినెట్టారు.

మంత్రుల హస్తం..

మంత్రుల హస్తం..

ఇది ఇలావుంటే జీవీ రఘుతోపాటు పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ పాండురంగారావు అవినీతి, అక్రమాల్లో కొత్త రికార్డునే నెలకొల్పారు. వీరిద్దరికి మంత్రులు కీలక పోస్టింగులు ఇప్పించారని పలువురు అధికారులు, ఉద్యోగులు ఆరోపిస్తుండటం గమనార్హం. సీఎంకు అత్యంత సన్నిహితుడైన ఓ మంత్రి, విశాఖపట్నంకు చెందిన మరో మంత్రి రఘు, పాండురంగరావులకు కీలక పోస్టింగ్స్ ఇవ్వడంలో ముఖ్య పాత్ర పోషించారని సమాచారం.

చర్యలు తీసుకోవాల్సిందే..

చర్యలు తీసుకోవాల్సిందే..

ఇలాంటి అవినీతి అధికారులకు మంత్రుల అండదండలు లభించడం శోచనీయమని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వాపోయారు. ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు చెప్పారు. వీరికి మద్దతుగా నిలిచిన మంత్రులపైనా చర్యలు తీసుకోవాలన్నారు.

అవినీతి జలగలు

అవినీతి జలగలు

రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజినీర్ ఇన్ చీఫ్ గంగా ధరం, ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాక్చర్ జగదీశ్వర్ రెడ్డి, ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ బీ సురేష్, గాజువాక సబ్ రిజిస్ట్రార్ డీ వెంకయ్యనాయుడు, జీఏడీ జాయింట్ సెక్రటరీ వెంకట రంగ సాయికుమార్, ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కేఎల్ భాస్కర్, ట్రాన్స్‌పోర్ట్ అధికారులు హైమారావు, ఇతర అధికారులు అవినీతికి పాల్పడి ఏసీబీకి చిక్కిన వారిలో ఉండటం గమనార్మం.

రఘు, పాండురంగారావుల రికార్డులు

రఘు, పాండురంగారావుల రికార్డులు

అయితే, సోమవారం పట్టుబడిన డీటీసీపీ జీవీ రఘు, అంతకుముందు పట్టుబడిన పాము పాండురంగారావులు మాత్రం తమ అవినీతి సంపాదనతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. రఘు రూ.500కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టగా, పాండురంగారావు ఏకంగా రూ. 1000కోట్ల వరకు అక్రమాస్తులు వెనకేసుకోవడం గమనార్హం. కాగా, ఇలాంటి అవినీతి అధికారులకు వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న రఘును మరికొంత కాలం విధుల్లో ఉండే విధంగా చేయాలని సదరు మంత్రి ప్రయత్నిస్తున్న తరుణంలో ఏసీబీ దాడులు ఆ మంత్రి ఆలోచనకు గండి కొట్టాయి.

హైదరాబాద్‌లోనే అనేక అక్రమాలు..

హైదరాబాద్‌లోనే అనేక అక్రమాలు..

హైదరాబాద్‌లోనే ఈ అధికారులు ఎక్కువగా అవినీతి సంపాదన పెంచుకోవడం గమనార్హం. అయ్యప్పసొసైటీలోనూ రఘు చేతివాటం ఉండటం ఆశ్చర్యకరమైన విషయమే. హఫీజ్‌పేట ప్రాంతంలో చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో పలు బ్లాక్‌లుగా నిర్మించిన అపార్ట్‌మెంట్లకు అప్పటి సిటీ ప్లానర్‌ రఘురామిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చాడు. ఆ అపార్టుమెంట్లకు వెళ్లడానికి సరైన రోడ్డు లేదు. దాంతో, విస్పర్‌ వ్యాలీ నుంచి ముంబై జాతీయ రహదారికి అనుసంధానంగా అక్కడికి వెళ్లడానికి రోడ్డు విస్తరణ పనులను దగ్గరుండి పర్యవేక్షించాడు. రెండు రాత్రులపాటు పట్టణ ప్రణాళికా యంత్రాంగమంతా విరామం లేకుండా ఆక్రమణల తొలగింపునకు పని చేసింది. ఇందుకు ఆయనకు దాదాపు రూ.3 కోట్ల వరకూ ముట్టాయని ప్రచారం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీకి చిక్కిన గోళ్ల వెంకట రఘురామిరెడ్డి జీహెచ్‌ఎంసీలో చీఫ్‌ సిటీ ప్లానర్‌గా పని చేసినప్పుడు నిర్వాకాల్లో ఇవి కొన్నే కావడం గమనార్హం. 2009 నుంచే రఘు అక్రమాలు మొదలయ్యాయని సమాచారం.

English summary
The Municipal Administration and Urban Development department is facing severe allegations as its HoDs are being caught by the ACB and branded as corruption emperors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X