కేసీఆర్ నిజంగా అలా అన్నారా?: ఆంధ్రజ్యోతి ఎందుకలా రాసింది..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాజ్యసభ పదవి అంటే ఇంత చులకనా?.. అధినేత మంచి చెడ్డలు చూసుకోవడం.. దగ్గరుండి వేళకు మందులు ఇవ్వడం.. ఇదా రాజ్యసభ సభ్యులు చేసే పని?..
సోమవారం ఉదయం ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ పేరిట ప్రచురితమైన కథనం చూస్తే ఎవరికైనా ఈ ప్రశ్నలు తలెత్తకమానవు. మరింత ఆశ్చర్యమేంటంటే.. అదే పత్రిక తెలంగాణ ఎడిషన్‌లో ఒకలాగా, హైదరాబాద్ ఎడిషన్‌లో మరోలాగా ఆ కథనాన్ని ప్రచురించింది.

 సంతోష్.. రాజ్యసభ ఎంపికపై

సంతోష్.. రాజ్యసభ ఎంపికపై

ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ భేటీ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక గురించి, ప్రధానంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ ఎంపికపై ఆయన కామెంట్ చేశారు. ఈ విషయాల్ని ఆయా పత్రికలు యథాతథంగా ప్రచురించాయి. అయితే ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రం కాస్త భిన్నంగా.. ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యపోయేలా దీన్ని ప్రచురించింది.

 టైంకు మందులు ఇవ్వడానికా

టైంకు మందులు ఇవ్వడానికా

'సంతోష్ నమ్మకమైన వ్యక్తి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న నా మంచీ చెడు చూసుకోవడానికి, నాకు టైంకు మందులు ఇవ్వటానికి సంతోష్ నా వెంట ఉంటే భరోసాగా ఉంటుంది.

అందుకే సంతోష్ ను రాజ్యసభకు తీసుకెళ్తున్నాను' అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టుగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇది చదివాక.. రాజ్యసభ పదవి అంటే టైంకు మందులు ఇచ్చే స్థాయికి దిగజారిందా? అన్న అభిప్రాయాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి.

 కేసీఆర్ ఎక్స్ క్లూజివ్‌గా ఏమైనా..

కేసీఆర్ ఎక్స్ క్లూజివ్‌గా ఏమైనా..

నిజంగా కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలే గనుక చేసి ఉంటే.. మిగతా పత్రికల్లోనూ రావాలి కదా!.. అన్న వాదన కూడా వినిపిస్తోంది. కేవలం ఆంధ్రజ్యోతితోనే కేసీఆర్ ఎక్స్ క్లూజివ్‌గా ఈ విషయాలు చెప్పారా?.. లేక అత్యుత్సాహంతో లేనివి కల్పించారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఎందుకీ తేడా..

ఎందుకీ తేడా..

ఆంధ్రజ్యోతి పత్రిక కేసీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ ఎడిషన్ లో ఒకలాగా.. హైదరాబాద్ ఎడిషన్ లో మరోలాగా ప్రచురించడం కూడా గమనించాల్సిన విషయం. తెలంగాణ ఎడిషన్‌లో 'టైంకు మందులు ఇవ్వడానికి సంతోష్ నా వెంట ఉంటే భరోసాగా ఉంటుంది' అని కేసీఆర్ చెప్పినట్టుగా ప్రచురించారు. అదే హైదరాబాద్ ఎడిషన్‌లో ఆ ఒక్క వాక్యం తప్ప మిగతాదంతా ప్రచురించారు.

 నిజంగా అలా అన్నారా?

నిజంగా అలా అన్నారా?

తెలంగాణ ఎడిషన్‌లో ఒకలా హైదరాబాద్ ఎడిషన్ లో మరోలా ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని ఎందుకు ప్రచురించిందో చాలామందికి అర్థం కావట్లేదు.

కేసీఆర్ నిజంగానే అంత చీప్ కామెంట్స్ చేశారా?.. అదే నిజమైతే హైదరాబాద్ ఎడిషన్‌లో మాత్రం ఎందుకు ప్రచురించలేదు అన్నది అర్థం కావడం లేదు. ఏదేమైనా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ కథనం కేసీఆర్ పట్ల విమర్శలకు, వ్యంగ్యస్త్రాలకు తావిచ్చేదిగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM KCR again in a controversy, his comments published by Andhrajyothy are trolling in social media.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి