ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!
వేసవి తీవ్రత పెరుగుతోంది. ఏసీ వినియోగంలోనూ గణనీయంగా మార్పు వచ్చింది. వేసవి వేడిని తట్టుకునేందుకు ఇళ్లలో, కార్యాలయాల్లో, వాహనాల్లో ఎక్కువసేపు ఏసీ వినియోగిస్తున్నారు. ఏసీ లో ఎక్కువ సేపు ఉండటం తో అనేక సమస్యలు పొంచి ఉన్నాయి. చల్లదనం కోసం ఏసీని ఎక్కువ గా వినియోగిస్తే దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో.. ఎక్కువగా ఏసీకి అలవాటు పడకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వినియోగం విషయంలోనూ కీలక సూచనలు అందిస్తున్నారు.
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏసీ వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే రోజంతా లేదా ఎక్కువసేపు ఏసీ గదుల్లోనే ఉండటం ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, చర్మ పొడి బారడం, తలనొప్పి, అలసట వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గదులు సరైన విధంగా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి అలర్జీలు, సైనస్ సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఏసీ గదుల్లో గాలి పొడిగా ఉండటం వల్ల దుమ్ము, బ్యాక్టీరియా, వైరస్ కణాలు గాలిలో ఎక్కువసేపు తేలియాడే అవకాశం ఉంది. ఇవి శ్వాస ద్వారా శరీరంలోకి చేరి అలర్జీలు, సైనస్, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏసీ గదుల్లో తేమ శాతం తగ్గిపోవడంతో చర్మంలోని సహజ తేమ క్రమంగా తగ్గుతుంది. దీంతో చర్మం పొడిబారడం, చెమట తగ్గడం, చర్మం పెళుసుగా మారడం, అలర్జీలు రావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

వేసవి వేళ నిపుణుల సూచనలు
ఎక్కువసేపు చల్లని వాతావరణంలో ఉండటం వల్ల శరీరం ఆ ఉష్ణోగ్రత కు అలవాటు పడుతుంది. బయట వేడి వాతావరణంలోకి వెళ్లినప్పుడు జలుబు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు కలగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా ఏసీలో చెమట పట్టకపోవడం వల్ల దాహం తక్కువగా అనిపిస్తుంది. దీనివల్ల నీరసం, అలసట, డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దీర్ఘకాలం ఏసీ గదిలో కూర్చోవడం వల్ల రక్తప్రసరణ మందగించి కండరాలు, కీళ్ల నొప్పులు రావచ్చని వైద్యులు చెబుతున్నారు. గదిలో సహజ గాలి ప్రవేశించేలా చూడాలి. ఏసీ ఉష్ణోగ్రతను 24-26 డిగ్రీల మధ్య ఉంచాలి. తరచూ బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలి పీల్చాలి. చర్మం కోసం మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. సమయానికి తగినంత నీరు తాగాలి. తాత్కాలికంగా చల్లదనాన్ని అందించే ఏసీపై పూర్తిగా ఆధారపడకుండా, మితంగా వినియోగిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
-
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!













Click it and Unblock the Notifications