పెద్దలనాటి 'చద్దన్నం'.. సమ్మర్ లో ఇలా టేస్టీగా..
ఇటీవల గ్యాస్ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో చాలామంది టిఫిన్స్ చేసుకోవడం బాగా తగ్గించేశారు. మరికొంతమంది వేసవి కారణంగా నూనె వంటకాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకొంతమంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు ఇష్ట పడుతున్నారు. అయితే పాతకాలంలో పెద్దలు తిన్న ఆరోగ్యమైన చద్దన్నం.. ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా పాతకాలం నాటి వంటలను తినేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అనేక ప్రాంతాల్లో చద్దన్నం స్టాల్స్ పెట్టి మరి ఈ వంటకాన్ని అమ్మేస్తున్నారు. అయితే మరి ఈ టేస్టీ, ఆరోగ్యకరమైన చద్దన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
చద్దన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. అన్నం తగినంత, వేడినీళ్లు, పాలు, మజ్జిగ, ఉల్లిపాయలు ఒకటి, పచ్చి మిర్చి తగినన్ని, ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి. ఇక చద్దన్నం తయారీ విధానం చూస్తే.. ఇప్పుడు ఓ గిన్నెలో మెత్తగా ఉడికించిన అన్నం తీసుకోవాలి. అందులో వేడినీళ్లు పోయాలి. ఇప్పుడు మిక్సింగ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో బాగా మరిగించిన పాలను పోసి కలుపుకోవాలి. ఇప్పుడు అన్నం మిశ్రమం వేడి తగ్గిన తర్వాత అందులో మజ్జిగ లేదా పెరుగును లూజ్ గా చేసి అందులో పోసి మిక్సింగ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమంలో ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి ఆ మిశ్రమంలో కలిపేసుకోవాలి. దాంతోపాటు పచ్చిమిర్చి కట్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంపై మూత పెట్టి రాత్రంతా అలా పక్కనపెట్టుకోవాలి. మట్టిపాత్ర అయితే మరింత ఆరోగ్య ప్రయోజకరం అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ప్లేట్ లోకి తీసుకుంటే చాలు.. ఎంతో టేస్టీ ప్రో బయోటిక్ చద్దన్నం రెడీ అయినట్టే..
-
ఆ స్టార్ హీరో ఫేవరెట్ "బంగాళ దుంప - దోసకాయ" కర్రీ ఎలా చేయాలంటే..? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications