దొండకాయ పల్లీల రోటి పచ్చడి.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు!
పచ్చళ్ళు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ముఖ్యంగా అప్పటికప్పుడు చేసుకునే రోటి పచ్చళ్లలో ఆ ప్రయోజనాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. మనకు దొరికే కూరగాయలతో అనేక విధాలుగా రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం దొండకాయ పల్లీలతో కలిపి చేసుకునే రోటి పచ్చడి గురించి తెలుసుకుందాం.
దొండకాయ పల్లీల రోటి పచ్చడి కి కావలసిన పదార్థాలు
దొండకాయలు -పావుకిలో
పల్లీలు -అరకప్పు
పచ్చిమిర్చి -15 కారాన్ని బట్టి
చింతపండు- ఉసిరికాయ సైజంత
ఉప్పు -రెండు స్పూన్లు (రుచికి తగినంత)
జీలకర్ర -ఒక టేబుల్ స్పూన్
వెల్లి పాయలు -పది రెబ్బలు
కరివేపాకు -రెండు రెమ్మలు
కొత్తిమీర -కొద్దిగా
నూనె -మూడు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం
ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అందులో వేయాలి. దాంతోపాటు పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించాలి. అందులోనే చింతపండు కూడా యాడ్ చేయాలి. దొండకాయలు పచ్చిమిరపకాయలు చింతపండు బాగా మగ్గిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి .
దొండకాయ పల్లీల పచ్చడి ఇలా చేస్తే సూపర్ టేస్ట్
పాన్ లో మిగిలి ఉన్న నూనెలో అరకప్పు పల్లీలను వేసి వేయించాలి. పల్లీలు దోరగా వేయించిన తర్వాత వాటిని కూడా గిన్నెలో వేసుకోవాలి. ఇక వీటన్నింటినీ చల్లార్చుకోవాలి.
చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి గాని, రోట్లో వేసి గాని రుబ్బుకోవచ్చు. మిక్సీ జార్ లో వేసినా, రోట్లో నూరినా ఈ మొత్తం మిశ్రమంతో పాటు రుచికి తగ్గ ఉప్పు, ఒలిచి పెట్టుకున్న వెల్లి పాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి రుబ్బుకోవాలి.
వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే అదుర్స్
మరీ పేస్టు లా దీనిని రుబ్బకూడదు. ఇక దీనిని పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకుతో పోపు చేసుకుని అయినా తినవచ్చు లేదా డైరెక్ట్ గా అలానే తినవచ్చు. దొండకాయ కూర ఇష్టం లేనివారు దొండకాయతో ఈ విధంగా పచ్చడి చేసుకుంటే కాస్త అన్నం ఎక్కువ తింటారు. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే ఆ రుచి వేరే చెప్పనక్కర్లేదు. మరెందుకు ఆలస్యం దొండకాయ పల్లీల పచ్చడిని ఒకసారి ట్రై చేయండి.
-
"గోంగూర పప్పు" ఇలా ట్రై చేస్తే ప్లేట్ ఖాళీనే.. -
సమ్మర్ లో చలువ చేసే 'సొరకాయ మజ్జిగ పులుసు'.. క్షణాల్లో ఇలా చేసుకోండి..! -
ఈజీగా.. ఫాస్టుగా స్నాక్ చేయాలా.. "గుంట పొంగనాలు" ట్రై చేస్తారా ?? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications